విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం అన్న వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, తంగిరాల రామిరెడ్డి,మాగంటి నవీన్, మునగ శేషు, బిక్షాలు రెడ్డి,గద్దె కళ్యాణ్, సాయి కృష్ణా రెడ్డి, బాలరాజు యస్వంత్, కొమిరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News