-30 ఏళ్ల కల సాకారం..వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం -నల్లమల కొండల్ని చీల్చుకుని నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు -తొలిదశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు..4 లక్షల మందికి తాగునీరు -జలహారతి అనంతరం కృష్ణా జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం -2028లో రెండోదశ పూర్తి…మార్కాపురంలోనూ కృష్ణా పుష్కరాలు -మార్కాపురం దోర్నాల వద్ద బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల …
Read More »Monthly Archives: August 2026
డేటా అనలటిక్స్‌తో మరింత సమర్దంగా పౌర సేవలు
-ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విస్తృత ప్రచారం -ప్రజల భాగస్వామ్యంతోనే సానుకూల ఫలితాలు -రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగుపరచాలని, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. వెలిగొండ, అల్లూరి విమానాశ్రయ ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం పెద్దఎత్తున వచ్చిందని… దీనిని ఇతర …
Read More »కృష్ణమ్మ ప్రవేశించే… కరవు నేల పరవశించే..
-మార్కాపురం జిల్లా అంతటా వెలి‘కొండంత’ సంబరం -నల్లమల సాగర్‌కు నీటి విడుదలను వీక్షించేందుకు పోటెత్తిన ప్రజానీకం -మగవారితో పోటీగా మహిళలు సైతం పెద్ద ఎత్తున రాక -కార్యక్రమం ముగిసినా కాల్వకట్ట పైనే రైతులు, మహిళలు -కృష్ణా నీళ్లను నెత్తిన చల్లుకుని, బాటిళ్లతో పట్టుకెళ్లిన జనం యర్రగొండపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది… దశాబ్దాలుగా కలగా మిగిలిన కృష్ణా జలాలు నల్లమల సాగర్‌ను తాకిన క్షణం చరిత్రలో నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి …
Read More »రేపు మొగల్తూరుకు సీఎం చంద్రబాబు
-పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చేరుకోనున్నారు. 11 గంటలకు నర్సాపురం చేరుకుని గోదావరి గట్టు సమీపంలోని 2,3 వార్డులతో పాటు పొన్నపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. …
Read More »తిరుపతి, విశాఖ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
-ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నిర్వహణ -పరిశుభ్రమైన జూ పరిసరాలు – ఆరోగ్యవంతమైన వన్యప్రాణులు లక్ష్యం -జూలలో జంతువుల దత్తతకు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జూ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూ ప్రాంగణాలను …
Read More »ఆక్వా కాలుష్య నియంత్రణపై పీసీబీ ప్రత్యేక దృష్టి
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో నమూనాల సేకరణ -జల కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించే దిశగా చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అక్కడి నీటి విడుదల వ్యవస్థల నుంచి నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. సేకరించిన నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి, కాలుష్య స్థాయిని అంచనా వేస్తారు. …
Read More »పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి
-రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలి -పారిశ్రామిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం …
Read More »పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లపై తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కార్యక్రమాలను ప్రజలకు …
Read More »ముసారాంబాగ్ మూసీపై వారధి..
-తెలంగాణ అభివృద్ధికి సారథి.. -మన రేవంతన్న..! -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్ బ్రిడ్జ్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు.. …
Read More »సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఇక కఠిన చర్యలు
-ప్లాస్టిక్ వినియోగం మానేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం -ప్రజలు, వ్యాపారులు సహకరించాలి -కలెక్టర్ డీకే బాలాజి చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ప్లాస్టిక్ రహిత చల్లపల్లి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News