-ఎంఎస్ఎంఈ లకు సమగ్ర సహకారం.. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు -జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ …
Read More »Monthly Archives: August 2026
కృష్ణా జిల్లాకు రూ.24,675 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
-ప్రాధాన్యత రంగం, వ్యవసాయం, పంట రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.24,675 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కార్యచరణ ప్రణాళికలో భాగంగా పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, క్రాప్ ఇన్సూరెన్స్ పురోగతిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కృష్ణాజిల్లా …
Read More »తూర్పుగోదావరి జిల్లా డీపీఆర్వో పెద్దింటి రవికి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన పెద్దింటి రవికి పదవీ విరమణ వీడ్కోలు సభను సోమవారం రాజమహేంద్రవరం లోని వైటీసీ ప్రాంగణంలో ఉన్న డీఐపీఆర్వో కార్యాలయంలో ఆత్మీయుల మధ్య నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని రవి సేవలను కొనియాడారు. నిబద్ధత, స్థితప్రజ్ఞతతో …
Read More »మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
-రూ.10 లక్షల PMEGP రుణంతో మగ్గం వర్క్ యూనిట్ నిర్వహణ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్‌అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు. ఆమె మార్గదర్శకత్వంలో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలోని ఆదర్శ పందలపారు గ్రామ సంఘం పరిధిలోని శ్రీరామదుర్గ సంఘం సభ్యురాలు జల్లేపల్లి లక్ష్మీ నాగ నిర్వహిస్తున్న మగ్గం వర్క్ …
Read More »మృత ఖైదీ వారసులు ఉంటే పరిహారం కోసం క్లెయిమ్ చేయాలి
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మృతి చెందిన ఖైదీ మసాడ శ్రీను రవి @ శ్రీను @ రవి, తండ్రి పైడినాయుడు సంబంధిత బంధువులు/చట్టబద్ధ వారసులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృత ఖైదీకి సంబంధించిన చట్టబద్ధ వారసులు లేదా సంబంధిత బంధువులు గుర్తించబడలేదని మురమండ, దుళ్ల గ్రామాల్లో కడియం తహసీల్దార్ నిర్వహించిన విచారణలో వెల్లడైనట్లు నివేదిక …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి IAS గారికి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ గారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో …
Read More »ఇంద్రకీలాద్రిపై ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్
-చెన్నై ప్లానర్స్‌తో క్యూ కాంప్లెక్స్ అనుసంధానంపై ఉన్నత స్థాయి చర్చలు -మహా మండపం, నూతన అన్నదాన భవనాల పరిశీలన -రానున్న దసరా ఉత్సవాల నాటికి పనులు వేగవంతం చేయాలని ఆదేశం ఇంద్రకీలాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు (IAS), దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. ముందుగా ఇంద్రకీలాద్రికి …
Read More »గంగిరెద్దుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ
-తెంపల్లెలో సంచార జాతుల విముక్తి ముఖ్యఅతిథిగాదినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే -ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు డిమాండ్లపై కృషి చేస్తా -గంగిరెద్దుల యువత హెచ్‌సీఎల్ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి -తెంపల్లెలో కూటమి రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో యార్లగడ్డ -కరపత్రాల ద్వారా రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన ఎమ్మెల్యే గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గంగిరెద్దుల కులస్తుల సమస్యలను శాసనసభ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలం …
Read More »సంచార జాతులకు సామాజిక న్యాయం అందించాలి
-వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక విధానం అవసరం -ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది: రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంచార, అర్ధ సంచార, విముక్త జాతులకు రాజ్యాంగ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక విధానం రూపొందించి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా సమాజంలోని అనేక వర్గాలకు స్వాతంత్ర్య ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని, ముఖ్యంగా సంచార, అర్ధ …
Read More »అమరావతి ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారుల సత్తా
– 13 స్వర్ణం, 12 రజత పతకాలు కైవసం – పతక విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఎన్‌టీఆర్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. క్రీడల్లో ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ వేదికలు, శిక్షణ, ప్రోత్సాహకాలు, వనరులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు …
Read More »
Prajavartha Online Telugu News