Breaking News

Daily Archives: August 6, 2026

ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ 188వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎచ్‌డీసీ) 188వ బోర్డు సమావేశం సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డు, జీవిత, సోమశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) విశ్వ, ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ) లక్ష్మీనాథ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలువురు …

Read More »

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల విశిష్టత, వాటి చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ కళాకారుల జీవనోపాధి పరిరక్షణ, హస్తకళల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. కొండపల్లి క్రాఫ్ట్ విలేజ్‌ను మరింత అభివృద్ధి …

Read More »

ఈనెల 29న విజయవాడలో జరగనున్న డిసైబుల్ క్రికెట్ పోటీలకు ఏపీఎస్‌డీసీ చైర్మన్ అనిమిని రవి నాయుడుకు ఆహ్వానం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSDC) చైర్మన్ అనిమిని రవి నాయుడు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 29వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న డిసైబుల్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా …

Read More »

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని తిరుపతి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల పార్లమెంట్‌ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో …

Read More »

అభివృద్ధి పనులను వారం రోజుల కాల వ్యవధిలో ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మానస సరోవరం పార్క్ లోని చెరువు, నల్లపాడులోని తెలగమాంబ చెరువుల అభివృద్ధి పనులను వారం రోజుల కాల వ్యవధిలో ప్రారంభించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం చెరువుల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీయుజిబిసిఎల్) ప్రతినిధులు, జిఎంసి ఎస్ఈలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతిపాదిత చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన డే …

Read More »

ఏ.ఈ.ఆర్.ఓలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కు సంబంధించి వారం రోజుల వ్యవధిలో నో మ్యాపింగ్, ఎనామిల్ ఓటర్లకు నోటీసులు జెనరేట్ చేసి, పంపిణీ చేయడం జరగాలని, విచారణ మరియు పరిష్కారం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈ.ఆర్.ఓ మరియు నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఏ.ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్సు హాల్ నందు ఏ.ఈ.ఆర్.ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు …

Read More »

ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల వారీగా ప్రభుత్వ పధకాల అమలు, కార్యదర్శుల పనితీరును జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నియమింపబడిన ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, తాగునీటి సరఫరా, శ్యాంపిల్స్ సేకరణ, వీధి …

Read More »

కర్బన ఉద్గారాల తగ్గింపుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు ఏంటి

-పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి పరిశ్రమలను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 …

Read More »

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు స్వాగతం పలికిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతి విమానాశ్రయంలో ఎంపీ మద్దిల గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నూకతోటి రాజేష్, గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రతినిధులు, నాయకులు కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సన్మానించిన ఆహ్వానం పలికారు.

Read More »

ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌ లో సత్తా చాటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి… : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ, బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌ను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజీ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-21 & ఓపెన్ వాలీబాల్ ట్రయల్స్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ …

Read More »