అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని నేడు(శుక్రవారం) రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పొనమ్మండ లక్ష్మణస్వామివర్మ రాష్ట్ర స్థాయి జయంతిని కాకినాడ జిల్లా కోరింగలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణ స్వామి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల …
Read More »Daily Archives: August 6, 2026
హామీ ఇవ్వకున్నా ‘నేతన్న సేవలో…’అమలు
* రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత * నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం * ఏటా రూ.25 వేలు అందజేసే పథకానికి నేడు శ్రీకారం * చేనేతలకు చంద్రన్న పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత * చీరాలలో నేడు 12 జాతీయ చేనేత దినోత్సవం * ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనగాని, సవిత చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల బాగుకోరే ప్రభుత్వం తమదని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు ఆర్థిక మేలు …
Read More »ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు ఎయిమ్స్ ఇవ్వండి: ఎంపీ శ్రీ లింగమనేని రమేశ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో రెండు కొత్త ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేయాలని, అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర …
Read More »హస్తకళలకు సాంకేతిక వెలుగులు
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం మొదలు • స్కాన్ చేస్తే చాలు.. కళాఖండం చరిత్ర చెప్పేస్తుంది… కళాకారుడి కష్టాన్ని వివరిస్తుంది.. • నకిలీ ఉత్పత్తుల నిరోధానికీ ఉపయోగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా …
Read More »అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
-దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు …
Read More »చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం
-‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు -జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిధులు విడుదల చేయనున్న సీఎం -రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి -నేతన్న కుటుంబాలతో ముఖాముఖి కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం… తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం …
Read More »క్యాబినెట్ సమావేశంలోని అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1391 వ (54వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ: విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) కార్యక్రమం కింద GVMC పరిధిలోని జోన్-IV, వార్డు నెం.35లో ఉన్న వెలంపేట మురికివాడ …
Read More »సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన లంకా దినకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు ఛైర్మెన్ లంకా దినకర్ మర్యాదపూర్వకంగా కలిసి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండు దశలుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల నివేదికను సమర్పించారు. అలాగే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ అంశాల సమీక్షలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును అధ్యయనం చేసేందుకు …
Read More »విజయవాడలో ‘పవర్’ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో చిన్న సినిమాగా రూపొందుతున్న “పవర్” చిత్రం గురువారం నాడు ప్రారంభమైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పరిమిత బడ్జెట్‌తో నూతన ఆలోచనలతో వస్తున్న ‘పవర్’ చిత్రం పెద్ద …
Read More »సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌లో పటిష్ట చర్యలు
-53వ PRAGATI సమావేశంలో రాష్ట్ర చర్యలను వివరించిన చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతోందని చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు, నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డా. పి.కె. మిశ్రా అధ్యక్షతన గురువారం …
Read More »
Prajavartha Online Telugu News