Breaking News

డూండి గణేష్ పూజా కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

-భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాధరపురం చెరువు సెంటర్‌లో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన డూండి గణేష్ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యాధరపురం చెరువు సెంటర్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), బుద్ధా వెంకన్న పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో నిర్వాహకులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. డూండి గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నాయకులు భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, దేవినేని చందు, ఎర్రుబోతు రమణ, వెలగపూడి శంకర్ బాబు, కోగంటి రామారావు స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *