మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : బాలలపై ఆన్లైన్ వేధింపుల అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ (వెబ్ సేఫ్ అండ్ వైస్) రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం. ఈ సందర్భంగా శ్రీ ఏ.వీ.ఎస్ వేటుకూరి. సూర్యనారాయణ రాజు చైర్ పర్సన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో బాలలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ముప్పులను సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ …
Read More »Daily Archives: September 23, 2026
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-ప్రజలు అత్యవసర సమాచారం కోసం 08672-252399 నంబర్‌కు ఫోన్ చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన/డిప్రెషన్ ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐ.ఏ.ఎస్. తెలిపారు. భారత వాతావరణ శాఖ …
Read More »యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే రెడ్ రన్
-హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలి -కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత” అనే నినాదంతో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలో బుధవారం 5కే రెడ్ రన్‌ను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు నిర్వహించిన ఈ అవగాహన పరుగులో సుమారు 300 మంది విద్యార్థులు, యువ క్రీడాకారులు, అధికారులు, శారీరక విద్యా అధ్యాపకులు, స్వచ్ఛంద …
Read More »విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు “వ్యక్తిత్వ వికాసం” అనే అంశంపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం యొక్క ప్రాధాన్యతను పరిచయం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కేవలం విద్యా ప్రతిభపైనే ఆధారపడదని, మంచి ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం, మంచి కమ్యూనికేషన్ …
Read More »ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ (స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రం)ను దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ బుధవారం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుర్గగుడి దేవస్థానంలో ఈ స్వయంచాలక యంత్రాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ …
Read More »బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తీర్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 33వ డివిజన్ సత్యనారాయణ పురం డివిజన్ కార్యాలయం నందు బుధవారం తెలుగుదేశం పార్టీ యువనాయకులు బొండా సిద్దార్ధ కి మేయర్ గా అవకాశం కల్పించాలి అని బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థకు మేయర్ అవకాశం కల్పించాలని బ్రాహ్మణ సంఘం తీర్మానం, విజయవాడ అభివృద్ధి, యువతకు ప్రాధాన్యత, ప్రజా సేవలో చురుకైన పాత్రను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ …
Read More »
Prajavartha Online Telugu News