Breaking News

యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే రెడ్ రన్

-హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలి
-కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత” అనే నినాదంతో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలో బుధవారం 5కే రెడ్ రన్‌ను ఘనంగా నిర్వహించారు.

బుధవారం ఉదయం వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు నిర్వహించిన ఈ అవగాహన పరుగులో సుమారు 300 మంది విద్యార్థులు, యువ క్రీడాకారులు, అధికారులు, శారీరక విద్యా అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా హాజరై 5కే రెడ్ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ హెచ్‌ఐవీ/ఎస్టీఐల నివారణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్‌ఐవీపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని, అవగాహన సందేశాన్ని తమ కుటుంబాలు, స్నేహితులు, సమాజంలోని ఇతర వర్గాలకు చేరేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువ క్రీడాకారులు, అధికారులు, శారీరక విద్యా అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్/ఎన్‌సీసీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నిర్వాహకులను అభినందించారు.

జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డా. ఎన్. వసుంధర మాట్లాడుతూ, హెచ్‌ఐవీ సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ అందుబాటులో ఉన్నాయని, హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారికి ఎఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నామని చెప్పారు. మందులను క్రమం తప్పకుండా వినియోగించడం ద్వారా వైరస్ నియంత్రణలో ఉంచుకుని ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. హెచ్‌ఐవీ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, కళాశాలల్లోని రెడ్ రిబ్బన్ క్లబ్‌లలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా స్పోర్ట్స్ అధికారి డి.ఎం.ఎం. శేషగిరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ అధికారి ఐ. శారద, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వినూత్న, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్/ఎన్‌సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవి తేజ, జిల్లా ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ బృందం సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లాలోని శారీరక విద్యా అధ్యాపకులు, ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, యువ ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొని 5కే రెడ్ రన్‌ను విజయవంతం చేశారు.

5కే రెడ్ రన్ విజేతలు :

పురుషుల విభాగం:
ప్రథమ బహుమతి – కె. హేమంత్, ఏఎల్ అమీర్ కళాశాల.
ద్వితీయ బహుమతి – కె. మణికంఠ, ప్రభుత్వ కళాశాల, రాజమహేంద్రవరం.

మహిళల విభాగం:

ప్రథమ బహుమతి – ఎం. అనుపమ, ఏఎల్ అమీర్ కళాశాల.
ద్వితీయ బహుమతి –

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *