రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఫీల్డ్ ఆఫీస్, కాకినాడ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మాహ్ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన రెండ్రోజుల పోషకాహార ప్రదర్శన ముగింపు సభ నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, చిరుధాన్యాలను (మిల్లెట్స్) ఆహారంలో భాగం చేసుకోవాలని, సుపోషిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. …
Read More »Tag Archives: rajamandri
యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే రెడ్ రన్
-హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలి -కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత” అనే నినాదంతో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలో బుధవారం 5కే రెడ్ రన్‌ను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు నిర్వహించిన ఈ అవగాహన పరుగులో సుమారు 300 మంది విద్యార్థులు, యువ క్రీడాకారులు, అధికారులు, శారీరక విద్యా అధ్యాపకులు, స్వచ్ఛంద …
Read More »సమన్వయంతో స్థానిక ఎన్నికలకు కూటమి వ్యూహం
-ఎన్నికల అబ్జర్వర్లతో కూటమి పార్టీల జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమా రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శనివారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన జిల్లా …
Read More »నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
-తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారు, నిడదవోలు పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -సాంప్రదాయ పంచకట్టులో దర్శనమిచ్చిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉత్సాహంగా గడిపిన మంత్రి దుర్గేష్.. -రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణభగవానుడు, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కాంక్షించిన మంత్రి దుర్గేష్ -నిడదవోలును నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, …
Read More »తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి గా ఎం.యు.వి. మనోహర్ బాధ్యతల స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి (D.P.T.O.)గా ఎం.యు.వి. మనోహర్ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డి.పి.టి.ఓ. ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మనోహర్‌కు ప్రజా రవాణా రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రాజమహేంద్రవరం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోలలో డిపో మేనేజర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ డి.పి.టి.ఓ.గా విధులు నిర్వహిస్తూ, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా డి.పి.టి.ఓ.గా నియమితులై బాధ్యతలు …
Read More »గొల్లగుప్పలో వైద్య శిబిరం ఏర్పాటు ముమ్మరంగా వైద్య సేవలు
-బాధితులకు మెరుగైన వైద్యం.. ప్రత్యేక వైద్య బృందాలతో నిరంతర పర్యవేక్షణ -భయాందోళన చెందాల్సిన అవసరం లేదు -పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ భద్రాచలం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా చేపట్టిన వైద్య శిబిరంలో క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన అనంతరం అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. …
Read More »తూర్పుగోదావరి జిల్లా డీపీఆర్వో పెద్దింటి రవికి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన పెద్దింటి రవికి పదవీ విరమణ వీడ్కోలు సభను సోమవారం రాజమహేంద్రవరం లోని వైటీసీ ప్రాంగణంలో ఉన్న డీఐపీఆర్వో కార్యాలయంలో ఆత్మీయుల మధ్య నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని రవి సేవలను కొనియాడారు. నిబద్ధత, స్థితప్రజ్ఞతతో …
Read More »మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
-రూ.10 లక్షల PMEGP రుణంతో మగ్గం వర్క్ యూనిట్ నిర్వహణ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్‌అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు. ఆమె మార్గదర్శకత్వంలో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలోని ఆదర్శ పందలపారు గ్రామ సంఘం పరిధిలోని శ్రీరామదుర్గ సంఘం సభ్యురాలు జల్లేపల్లి లక్ష్మీ నాగ నిర్వహిస్తున్న మగ్గం వర్క్ …
Read More »మృత ఖైదీ వారసులు ఉంటే పరిహారం కోసం క్లెయిమ్ చేయాలి
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మృతి చెందిన ఖైదీ మసాడ శ్రీను రవి @ శ్రీను @ రవి, తండ్రి పైడినాయుడు సంబంధిత బంధువులు/చట్టబద్ధ వారసులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృత ఖైదీకి సంబంధించిన చట్టబద్ధ వారసులు లేదా సంబంధిత బంధువులు గుర్తించబడలేదని మురమండ, దుళ్ల గ్రామాల్లో కడియం తహసీల్దార్ నిర్వహించిన విచారణలో వెల్లడైనట్లు నివేదిక …
Read More »నేడే (ఆగస్టు 25) రాజమహేంద్రవరానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం (25-08-2026) సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్వారీ మార్కెట్ వద్ద ఉన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 27వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే DISHA సమావేశంలో ఎంపీ శ్రీమతి …
Read More »
Prajavartha Online Telugu News