Breaking News

Tag Archives: rajamandri

మే 18 సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), భూసంబంధ ఫిర్యాదుల పరిష్కార వేదిక (రెవెన్యూ క్లినిక్) కార్యక్రమాలు సోమవారం (మే 18న) యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి …

Read More »

ఆర్టిఐహెచ్ లో MSME రంగ అభివృద్ధికి అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో “MSME Talks 2026” పేరుతో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి, పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన కార్యక్రమం స్థానిక బొమ్మూరు లోని ఆర్టీఐ హెచ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, MSME యూనిట్ నిర్వాహకులు కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ …

Read More »

బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

-ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాణాసంచా తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే అన్నారు. ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని …

Read More »

రాజమహేంద్రవరంలో నూతన 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభం

-న్యాయ మౌలిక వసతులు ప్రజల విశ్వాసానికి ప్రతీకలు కావాలి -ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి బార్ …

Read More »

రీ సర్వే పనులు వేగవంతం చేయాలి

-“మీ భూమి–మీ హక్కు” గ్రామసభలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ -364 మందికి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండలం పరిధిలో బుధవారం జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ క్షేత్ర స్థాయిలో పర్యటించి 5 వ విడత రీ సర్వే పనులను పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణ గూడెం గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. మండలంలోని చాగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న ఐదో విడత రీ సర్వే పనులను ఏడీ …

Read More »

మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ యూనిట్ ప్రారంభం

-‘ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త’ విజన్‌తో మహిళలకు స్వావలంబన – మెప్మా పిడి టి. కనక రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం క్వారీ మార్కెట్ సెంటర్, రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ యూనిట్‌ను ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్న స్థాయి వ్యాపారాలను ప్రారంభించి, ప్రభావవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన “ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త (OFOE)” విజన్‌లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందజేసిన సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ గల ఎగ్ కార్ట్ …

Read More »

మే 1 నుంచి స్కూల్, కాలేజీ బస్సుల ప్రత్యేక తనిఖీలు

-ఫిట్‌నెస్ లేని వాహనాలపై చర్యలు – మే 15లోపు సర్టిఫికేషన్ తప్పనిసరి -జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రవాణా శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ మరియు కాలేజీ బస్సులపై ప్రత్యేక తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 108 …

Read More »

నేడు (మే 4) పీజీఆర్ఎస్ యథావిధిగా

-జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల స్వీకరణ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు (మే 4) పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) సోమవారం సాధారణంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అమరావతి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 4న నిర్వహించే సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో, జిల్లా జాయింట్ …

Read More »

శ్రియో కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

-టెక్నాలజీతో సామాన్యుడికి సేవలందించడం అభినందనీయమని యాప్ నిర్వాహకులను కొనియాడిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవడంలో యువత ముందుండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన ‘శ్రియో కనెక్ట్’ (Srieyo Connect) యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ నిర్వాహకులు యాప్ పనితీరును, దాని వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు. …

Read More »

రైతుకు వెన్నుదన్నుగా ఉంటాం:మంత్రి కందుల దుర్గేష్

-కష్టాల్లో ఉన్న రైతులకు అండగా కాన్వాయ్ ఆపి ధైర్యాన్నిచ్చిన మంత్రి దుర్గేష్…కానూరు వద్ద ధాన్యం రాశుల పరిశీలన -ఆకస్మిక వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి దుర్గేష్ కు చూపించిన రైతాంగం.. చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ -ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని రైతులకు మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కష్టమే తన కష్టంగా భావించే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ …

Read More »