Breaking News

Tag Archives: rajamandri

నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – 3242 మంది హాజరు

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నీట్ (NEET) పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3242 మంది పరీక్షలకు హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వారీగా వివరాలు: దరఖాస్తు …

Read More »

ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక లేఖ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అత్యవసర లేఖ రాసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్ 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి సుమారు 4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్ ధరలు కనీస మద్దతు …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలను అరికట్టాలి – ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం బెంగుళూరు నుండి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్నీ ఏజెన్సీలు, సరఫరా దారులు కృత్రిమ కొరత సృష్టించి, అనవసరంగా పెట్రోల్ కొరత వాతావరణం సృష్టిస్తున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై కఠిన నిఘా ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, …

Read More »

రూ.485 కోట్ల విలువైన విద్యుత్ ప‌నులకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు

-అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాలు 2027 కు స‌ర్వం సిద్ధం చేస్తున్నాం -రెండు నెల‌లు ముందుగానే విద్యుత్ ప‌నుల పూర్తికి ప్ర‌ణాళిక‌ -దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసిన మొద‌టి సీఎం చంద్ర‌బాబు -ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల త‌గ్గింపుకు చర్యలు -గోదావ‌రి పుష్క‌రాల విద్యుత్ ప‌నుల కోసం రూ.150 కోట్లు కేటాయింపు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ రాజ‌మండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాల‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నామ‌ని ఇంధ‌న శాఖ …

Read More »

2027 మహా పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం

-సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్.. పుష్కరాలకు కొత్త శోభ -మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల బృందం వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అఖండ గోదావరి మహా పుష్కరాలు–2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతోందనీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, …

Read More »

జనగణన-2027లో మంత్రి కందుల దుర్గేష్ తొలి అడుగు

-రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్ -దేశ ప్రగతికి ‘జనగణన’ దిక్సూచి అని, జనగణనలో నేను నమోదు చేసుకున్నాను.. మీరు కూడా పాల్గొనండి!” మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -ప్రజాస్వామ్య పరిపాలనలో జనాభా లెక్కలే కీలకం..జనాభా ప్రాతిపదికనే సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుంది..జనగణనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని వెల్లడి -ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని అధికారులకు సహకరించాలని మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి -‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రారంభం అయింది…. అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపు -ఏప్రిల్ …

Read More »

ఏప్రియల్ 16 నుంచి చేపట్ట వలసిన సెన్సస్-2027 స్వీయ లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి క్షేత్ర స్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

-ప్రజలు సెన్సస్ 2027 లో ఆన్‌లైన్ ద్వారా స్వీయ నమోదు కు 7 సులభ పద్ధతులు – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని , అదే సమయంలో ఏప్రియల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు లో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ …

Read More »

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-వేమగిరిలో ఘనంగా డా. బి. ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు.. పాల్గొని ఘన నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా “జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్” అంటూ నినదించి, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలి

-నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్. శివరాముడు, కాకర ఆనందరావుకు మంత్రి కందుల దుర్గేష్ సూచన -రాజమహేంద్రవరం లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోలు -ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలని ఇటీవల నూతనంగా నియమింపబడ్డ రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇటీవల నూతనంగా రాజమహేంద్రవరం ఆర్డీవోగా …

Read More »

ఈ వి ఎమ్ గోదాముల భద్రతపై కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీలు – మరింత కట్టుదిట్టం చేయాలన్న సూచనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) గోదాములను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పరిశీలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, EVMల భద్రత, నిల్వ విధానం, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు. గోదాముల వద్ద ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, …

Read More »