Breaking News

వార్షిక రుణ లక్ష్యాలలో జిల్లాలో 99.32% ప్రగతి

-సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా పంట రుణాలు మంజూరు చేయాలి
-పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026–27 పుస్తకావిష్కరణ
-జిల్లా సంయుక్త కలెక్టర్ వై. మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాంకర్లు తప్పనిసరిగా పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలియ చేయడం జరిగింది. మంగళవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్‌లోబ్యాంకర్ల తో జిల్లా సలహా కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం కు జేసీ ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించారు.

ఈ సందర్భంగా వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికపై సమీక్షించారు. ప్రాధాన్యతా రంగంలో రూ.18,843 కోట్ల రుణ లక్ష్యానికి గాను మూడవ త్రైమాసికం ముగిసే నాటికి రూ.16,269 కోట్ల రుణాలు మంజూరు చేసి 86.33 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. నాన్-ప్రయారిటీ రంగంలో రూ.5,087 కోట్ల లక్ష్యానికి గాను రూ.7,498 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం జిల్లాకు రూ.23,930 కోట్ల రుణ లక్ష్యానికి గాను డిసెంబర్ చివరి నాటికి రూ.23,767 కోట్ల రుణాలు మంజూరు చేసి 99.32 శాతం ప్రగతి సాధించినట్లు వెల్లడించారు. జిల్లాలో కౌలు రైతులకు 66,584 సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, అందులో కేవలం 15,698 మంది రైతులకు మాత్రమే రూ.111 కోట్ల రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన అర్హులైన కౌలు రైతులకు రుణాలు ఎందుకు మంజూరు కాలేదో బ్యాంకర్లను ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్క కౌలు రైతుకు పంట రుణాలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లాలో పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కింద 5,153 మందికి రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇంకా 6,211 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సాంకేతికతను వినియోగించి డిజిటల్ విధానంలో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి రుణాల మంజూరు వేగవంతం చేయాలని అధికారులు సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద 220 ప్రాజెక్టులకు రూ.12.8 కోట్ల మార్జిన్ మనీతో రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు.

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజ్ ద్వారా అందిస్తున్న రుణాల విషయంలో మూడవ త్రైమాసికం ముగిసే నాటికి 67 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు.
PM Surya Ghar Muft Bijli Yojana మరియు PM Vishwakarma Yojana పథకాల కింద రుణాల మంజూరులో బ్యాంకర్లకు ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత శాఖల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

జిల్లా ఆర్థికాభివృద్ధి మరియు ప్రాధాన్య రంగాలకు రుణాల ప్రవాహాన్ని సమర్థవంతంగా పెంచే లక్ష్యంతో రూపొందించిన “పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (PLP) 2026–27” పుస్తకాన్ని అధికారులు ఘనంగా ఆవిష్కరించారు. వ్యవసాయం, సూక్ష్మ–చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు మరియు గ్రామీణాభివృద్ధి రంగాలకు అవసరమైన ఆర్థిక వనరుల అంచనాలు, బ్యాంకుల రుణ లక్ష్యాలు, అభివృద్ధి అవకాశాలు ఈ ప్రణాళికలో సమగ్రంగా ప్రతిపాదించబడ్డాయి. జిల్లాలో సమతుల్య ఆర్థిక పురోగతికి ఈ ప్రణాళిక మార్గదర్శకంగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ టి. సీతారామమూర్తి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ నిర్మలా , నాబార్డ్ ఏ జి ఎమ్ చక్రధర్ రావూరి, ఆర్ బి ఐ గిరిధర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.వి. ప్రసాద్, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల డీజీఎంలు, ఏజీఎంలు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *