Breaking News

మార్చి 31 నాటికి నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యం సాధించాలి

-కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను వసూళ్లే ప్రధాన ఆధారమని, మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

మంగళవారం ఆనం కళా కేంద్రం లో గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులతో కమిషనర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి పన్నుల వసూళ్లు కీలకమని, లక్ష్య సాధనలో అలసత్వం అసలు సహించబోమని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలలో భారీ మొత్తంలో పన్నులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పన్నులు చెల్లించని వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా పన్నులు చెల్లించే విధానాన్ని అమలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలిగిందని కృష్ణ తేజ తెలిపారు. పట్టణ ప్రాంతాల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పంచాయతీ సెక్రటరీలకు పదోన్నతుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసినట్లు, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి వి .శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే రూ. 82 కోట్ల పన్ను వసూళ్లు జరిగినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిగిలిన పన్నుల వసూళ్లు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఈ సమీక్షా లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ సి ఈ వో వి వి లక్ష్మణ్, డిఎల్‌పిఓ ఏం.నాగలత, డి ఎల్ డి వో లు పి. వీణా దేవి, ఏ స్లివా రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *