Breaking News

జి జి హెచ్ – వైద్య కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ – మానవ హారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రజల్లో క్షయవ్యాధి పట్ల సమగ్ర అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య విద్యార్థులు మరియు ప్రజల భాగస్వామ్యం కీలకమని డా. కె.వి. శివ ప్రసాద్ పేర్కొన్నారు. సమాజంలో క్షయవ్యాధిపై అపోహలను తొలగించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సమయానుకూల చికిత్స ద్వారా టిబిని పూర్తిగా నివారించవచ్చని ఆయన సందేశం ఇచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ధవళేశ్వరం లోని రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (RHTC) వద్ద అవగాహన ర్యాలీ మరియు మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. వి.వి. దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో క్షయవ్యాధి పట్ల చైతన్యం కల్పించే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. క్షయవ్యాధి వ్యాప్తి కారణాలు, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలు, పూర్తి స్థాయి చికిత్స అవసరం, రోగుల పట్ల సమాజ ధృక్పథం, క్షయవ్యాధి నిర్మూలనలో వైద్య విద్యార్థులు మరియు ప్రజల పాత్ర వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగ బోధనా సిబ్బంది ప్రొఫెసర్ డా. బి. శ్రీనివాస్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆర్. సురేంద్ర బాబు (టిబి ముక్త భారత్ నోడల్ అధికారి), డా. ఆర్.వి.వి. సత్యనారాయణ (వైద్యాధికారి, పిహెచ్‌సి ధవళేశ్వరం), రమాదేవి (పిహెచ్‌ఎన్), డా. భరత్ ఎస్.ఆర్., కళాశాల సిబ్బంది మరియు పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *