అందరికీ సంస్కృతం అకాడమీ లక్ష్యం:ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పండితులు మాత్రమే సంస్కృతం అధ్యయనం చేయగలరన్న అపోహను దూరం చెయ్యాలి అన్న లక్ష్యం తో సంస్కృత అకాడమీ పని చేస్తుంది అని అందుకు తగ్గ మార్గ నిర్దేశం చేయాల్సిందిగా వడ్డే శ్వరంలోని తెలుగు మరియు సంస్కృత అకాడమీ లో సోమవారం జరిగిన సంస్కృత మేధావుల సదస్సు ను ఉద్దేశించి.. చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. దేశం భిన్న కులాలు, మతాలు గా విడిపోయిన ఈ సంధికాలం లో దేశం మొత్తాన్ని కలిపి ఉంచగలిగే శక్తి సంస్కృత బాష కు ఉందని విల్సన్ అన్నారు.
“అమృతం మధురమైంది. సంస్కృతం అంతకంటే మధురమైంది అంటూ సంస్కృత వ్వాక్యాన్ని ఉదహరిస్తూ “అమృతం మధురం సమ్యక్ సంస్కృతం హిత తో దకం “అన్నారు.
ఈ విశ్వం సంస్కృత భాషతో సామన్వితం మై వుంది అనేది వైదిక వాక్కు అని గుర్తు చేశారు. ప్రాచీన కాలంలో భారతదేశంలో సంస్కృత భాష కేవలం స్పష్టంగా ఉండడమే కాదు అది మన జ్ఞానానికి తల్లిగా ఉంది. కానీ ఈ ఆధుని కాలంలో ఈ భాష కేవలం ధార్మిక విషయాలకే పరిమితమైందనే అభిప్రాయం జనాల్లో వుంది అని శరత్ చంద్ర గుర్తు చేశారు. ఈ సందర్బంగా పాల్గొన్న సంస్కృత పండితులు పలు సూచనలు చేశారు. అకాడమీ నేత్రుత్వం రాష్ట్రము లో సంస్కృత సప్తాహ కార్యక్రమం నిర్వహించాలని కోరారు.సంస్కృత భాష వ్యాప్తి కోసం చిన్న.. చిన్న పుస్తకాలు వేసి విద్యార్థుల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. అందులో నీతి కథలూ.. జాతీయ భావనలతో కూడినవి ఉండాలి అన్నారు.
సంస్కృతం.. తెలుగు భాషలు తల్లి.. బిడ్డలు లాంటివి అని ఆచార్య దీక్షితులు అన్నారు. సంస్కృత అకాడమీ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా భాష అభివృద్ధి కి దోహదం చెయ్యాలి అన్నారు. ఆచార్య దొర్బల ప్రభాకర్ శర్మ మా ట్లాడుతూ ప్రపంచం లో మెదట పుట్టిన భాష సంస్కృతమే అన్నారు. హెబ్రూ భాష కంటే ప్రాచీన మైంది అన్నారు.ఆచార్య రమణ శాస్త్రీ మాటాడుతూ రాష్ట్రము లో ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కలిపిస్తే సంస్కృతం లో ఒరియాంటేషన్ క్లాసులు నిర్వహిస్తాం అన్నారు
సమావేశంలో ఆచార్యులు పి. టి జీవి. రంగా చార్యులు, డాక్టర్. పాలపర్తి శ్యామలా నంద రావు, డాక్టర్ దివి నరసింహ దీక్షితులు, డాక్టర్ వందన రావు, డాక్టర్ రమణ మూర్తి, ఆచార్య మారుదూరి నరసింహాచార్యులు, పిన్నమనేని భవాని, తిరుపతి సంస్కృత యూనివర్సిటీ ఆచార్యులు నందన్ రావు, డాక్టర్ కనపాల కుమార్, వి జి చంద్రన్ లతో పాటు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరి, డాక్టర్ ఎస్. వి టి రాజ్యలక్ష్మి, డాక్టర్ గ్లోరీ సత్యవాణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *