Breaking News

తూర్పు గోదావరిలో పైప్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి

-పైపు లైన్లు ఏర్పాటు చేసిన ఏరియాలోని గృహాలకు గ్యాస్ సరఫరా కు కార్యాచరణ సిద్ధం చేయాలి
-జేసి వై మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు పారిశ్రామిక అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువు సరఫరాను విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు.

మంగళవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో Godavari Gas Private Limited ప్రతినిధులు, హోటల్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేసి గృహ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షిత గ్యాస్ సరఫరా అందించాలని, ఇందుకు సంబంధించి ఏజెన్సీస్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్ ఏర్పాటు, గృహ మరియు వాణిజ్య కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో ఎదురయ్యే క్షేత్ర స్థాయి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే గృహ సముదాయాల వద్ద పైపు లైన్లు అందుబాటులో ఉన్న గృహాల వారు ఇన్స్టలేషన్ చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొంటూ, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని స్పష్టం చేశారు. హోటళ్లు, పరిశ్రమలు తప్పనిసరిగా పైప్ గ్యాస్ వినియోగానికి మారాలని కోరారు.
జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పైప్‌లైన్ విస్తరణ, కనెక్షన్ల మంజూరు, రోడ్డు అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై నిరంతర సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా పైప్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని జేసి మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 1,15,000 గృహ కనెక్షన్ల లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని ఏజెన్సీస్ ప్రతినిధులు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 19 వేల ఇళ్లకు కనెక్షన్లు అందించామని తెలిపారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైపుల ద్వారా గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఎల్‌పిజి వినియోగదారులకు అందుతున్న సబ్సిడీ పైప్ గ్యాస్ వినియోగదారులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మండల, సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను పైప్ గ్యాస్ వినియోగానికి ప్రోత్సహించాలని సూచించారు. పైప్‌లైన్ విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతంగా మంజూరు చేయడం, రోడ్డు కోతల పునరుద్ధరణలో సమన్వయం, మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీకాంత్ మాట్లాడుతూ గృహ వినియోగదారులకు సురక్షితమైన, నిరంతరాయ గ్యాస్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గృహ కనెక్షన్ పొందడానికి రూ.6,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, అందులో రూ.5,000 వాపసు చేయబడుతుందని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ ధర క్యూబిక్ మీటర్‌కు రూ.55గా ఉండి, ద్వైమాసిక బిల్లింగ్ విధానం అమల్లో ఉందన్నారు. వాణిజ్య వినియోగదారులకు క్యూబిక్ మీటర్ గ్యాస్ ధర రూ.75గా నిర్ణయించ బడిందని, ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లింగ్ జరుగుతుందని తెలిపారు. వాణిజ్య కనెక్షన్లకు రూ.25 వేల నుండి రూ.1 లక్ష వరకు డిపాజిట్ వర్తిస్తుందని వివరించారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పైప్‌లైన్ విస్తరణ, అపార్ట్మెంట్లలో అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, కనెక్షన్ల మంజూరు వేగవంతం వంటి చర్యలు చేపడతామని తెలిపారు.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 1,15,000 గృహ కనెక్షన్ల లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 19 వేల ఇళ్లకు కనెక్షన్లు అందించామని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడంతో మరిన్ని కనెక్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. కొవ్వూరు పట్టణంలో ఇప్పటికే 700 గృహాలకు పైప్ గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున ఐదు గృహ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, సమీప కాలంలో అదనంగా 11 వేల కనెక్షన్లు ఇవ్వగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, హోటల్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *