Breaking News

జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ – విశేష స్పందన

-మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు
-వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు
-వైద్య బృందానికి ప్రజా ప్రతినిధుల ప్రశంసలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు.

ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, ఐఎంఏతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొని సేవలందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సమాజానికి సమాచారాన్ని అందించే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య సేవలు అందించబడినట్లు తెలిపారు. అలాగే మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. వైద్య సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమాచారాన్ని అందించే పాత్రికేయులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. తాను శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు.

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిబిరంలో పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందించడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల ఆరోగ్యం పట్ల నిబద్ధత కలిగి ఉందనీ స్పష్టం చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను, వైద్య బృందాలను, జిల్లా కలెక్టర్ ను ఆయన అభినందించారు.

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ మొత్తం 233 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విభాగాల వారీగా జనరల్ మెడిసిన్ 147, గైనకాలజీ 22, ఆర్థోపెడిక్ 14, డెంటల్ 10, కంటి పరీక్షలు 23, గుండె సంబంధిత 11, చర్మ వ్యాధి 6, ఈఎన్టీ 3 కేసులు, మమో గ్రాఫీ 16, ఆల్ట్రాసౌండ్ 57 కి పరీక్షలు నిర్వహించామన్నారు.

అవసరమైన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించగా, 27 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే. వెంకటేశ్వర రావు, జిల్లా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవా సమన్వయకర్త పి. ప్రియాంక, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు, 50 మంది వివిధ ఆసుపత్రుల వైద్యులు, 150 మంది వైద్య, ఆశా, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *