– జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యులు కె. మల్లేశ్వరరావు, కె. లక్ష్మి లు మార్చి 28, 29 తేదీలలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, మర్యాదలు కల్పించాలని గౌరవ చైర్మన్ ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. 28వ తేదీ ఉదయం 06.20 నుండి 09.30 గంటల మధ్య కె. మల్లేశ్వరరావు విశాఖపట్నం నుండి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ద్వారా రాజమండ్రి చేరుకోగా, 09.40 నుండి 09.50 గంటల మధ్య రైల్వే స్టేషన్ నుంచి బొమ్మూరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చేరుకుంటారు. ఇదే సమయంలో కె. లక్ష్మి పోలవరం నుండి రోడ్డు మార్గంలో పాఠశాలకు చేరుకుంటారు.
తదుపరి కార్యక్రమంలో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 01.10 గంటల వరకు మహిళా ప్రత్యేక జైలు, సెంట్రల్ జైలు రాజమహేంద్రవరం సందర్శించి ఖైదీలతో పరస్పర చర్చలు జరిపి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు సూచిస్తారు. అనంతరం మధ్యాహ్నం 01.10 నుండి 02.00 గంటల వరకు పీఎంఎస్ కళాశాల బాలికల హాస్టల్-1 (ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం)లో సందర్శన, విద్యార్థులతో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. 02.00 నుండి 02.10 గంటల మధ్య ఆర్&బీ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. సాయంత్రం 05.00 నుండి 06.40 గంటల మధ్య కోవ్వూరు పీఎంఎస్ కళాశాల (బాలికలు)ను సందర్శించి రాత్రికి ఆర్&బీ అతిథి గృహంలో నివసిస్తారు.
29వ తేదీ కార్యక్రమంలో భాగంగా అర్ధరాత్రి 12.00 నుండి 12.10 గంటల మధ్య హాస్టల్-2 కు బయలుదేరి, మధ్యాహ్నం 01.00 నుండి 02.00 గంటల వరకు పీఎంఎస్ బాలికల హాస్టల్-2 సందర్శన, భోజనంలో పాల్గొని, అనంతరం 02.00 నుండి 03.15 గంటల మధ్య హాస్టల్-2, 3 లను పరిశీలించి తిరిగి ఆర్&బీ అతిథి గృహానికి చేరుకుంటారు.
అనంతరం కె. లక్ష్మి మధ్యాహ్నం 03.00 గంటలకు పోలవరం బయలుదేరగా, కె. మల్లేశ్వరరావు సాయంత్రం 04.00 గంటలకు విశాఖపట్నం బయలుదేరీ వెళ్ళడం జరుగుతుంది .
Prajavartha Online Telugu News