Breaking News

డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించిన బెయిల్ అర్జీల స్థితిగతులపై కూడా సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *