Breaking News

“వికాస” ఆధ్వర్యంలో మార్చ్ 28న జాబ్ మేళా

– కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“వికాస” ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని వికాస కార్యాలయం (బొమ్మూరు, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఈ జాబ్ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబిఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుండి రూ.20,000 వరకు వేతనం తో పాటు అదనంగా ఇన్సెంటివ్లు కూడా అందించబడతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు శనివారం ఉదయం 9.00 గంటలకు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులతో బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని వికాస కార్యాలయం (హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో హాజరు కావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చరావు ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *