ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలి

-నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్. శివరాముడు, కాకర ఆనందరావుకు మంత్రి కందుల దుర్గేష్ సూచన
-రాజమహేంద్రవరం లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోలు
-ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలన అందించాలని సూచించిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులుగా తమదైన ముద్ర వేయాలని ఇటీవల నూతనంగా నియమింపబడ్డ రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇటీవల నూతనంగా రాజమహేంద్రవరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఆర్. శివరాముడు, కొవ్వూరు ఆర్డీవోగా నియమితులైన కాకర ఆనందరావు లు గురువారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్డీవోలతో మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ త్వరితగతిన పరిష్కరించడంలో తమదైన ముద్ర వేయాలన్నారు. రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రజా సమస్యలను, అభివృద్ధి పనులను మంత్రి దుర్గేష్ అధికారులకు వెల్లడించారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఆర్డీవోలిద్దరికీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలుపుతూ, వారి విధి నిర్వహణలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాలని సూచించారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *