Breaking News

ఏప్రియల్ 16 నుంచి చేపట్ట వలసిన సెన్సస్-2027 స్వీయ లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి క్షేత్ర స్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

-ప్రజలు సెన్సస్ 2027 లో ఆన్‌లైన్ ద్వారా స్వీయ నమోదు కు 7 సులభ పద్ధతులు
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని , అదే సమయంలో ఏప్రియల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు లో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

గురువారం 16.04.2026 నుండి ప్రారంభమయ్యే స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కీర్తి చేకూరి ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి వివరాలు తెలియ చేస్తూ, భారత దేశ జనగణన చరిత్రలో తొలిసారిగా స్వీయ నమోదు (Self- Enumeration) సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.

ప్రజలు, వివిధ విభాగాలకు చెందిన వారు https://se.census.gov.in⁠� పోర్టల్ ద్వారా 16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల అవగాహన ప్రచార కార్యక్రమాన్ని (15th April – 30th April 2026) రూపొందించినట్లు చెప్పారు.

ఈ ప్రచారంలో ప్రతి రోజు వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు, సమూహాలకు చెందిన వారిని చేరుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమ ముఖ్యాంశాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందనీ తెలిపారు.

16 ఏప్రిల్ : ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు

17 ఏప్రిల్ : సచివాలయ, జిల్లా, మండల కార్యాలయ సిబ్బంది

18 ఏప్రిల్ : ప్రముఖులు, క్రీడాకారులు, కళాకారులు

19 ఏప్రిల్ : మహిళా సంఘాలు (SHGs)

20 & 30 ఏప్రిల్ : MGNREGS కార్మికులు

21 ఏప్రిల్ : గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది

22 ఏప్రిల్ : పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు

23–24 ఏప్రిల్: ఆంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన ప్రాంతాలు

25 ఏప్రిల్ : రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్

26 ఏప్రిల్ : వృద్ధాశ్రమాలు, “Census 5K Run”

27 ఏప్రిల్ : దుకాణాలు, పరిశ్రమలు

28 ఏప్రిల్ : బ్యాంకులు, SHGs రెండో దశ

29 ఏప్రిల్ : పోలీస్ సిబ్బంది

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది వరకు స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అదేవిధంగా, ప్రముఖ వ్యక్తుల ద్వారా స్వీయ లెక్కింపును ప్రారంభించి, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమైనదని, ఎవరిపైనా బలవంతం చేయరాదని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఈ జాతీయ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.

సెన్సస్-2027లో భాగంగా మీరు ఇంటి నుంచే మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానం:

స్టెప్ 1: వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
బ్రౌజర్‌లో https://se.census.gov.in⁠� ఓపెన్ చేయండి

స్టెప్ 2: రిజిస్ట్రేషన్ (New User)
“Register” లేదా “New User Sign Up” పై క్లిక్ చేయండి
మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి
OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి
యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ సెట్ చేయండి

స్టెప్ 3: లాగిన్ అవ్వండి
మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి

స్టెప్ 4: కుటుంబ వివరాలు నమోదు
కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి
పేరు
వయస్సు / జనన తేదీ
లింగం
విద్య, వృత్తి
ఇతర అవసరమైన సమాచారం

స్టెప్ 5: చిరునామా వివరాలు
మీ ఇంటి పూర్తి చిరునామా నమోదు చేయండి
గ్రామం / పట్టణం / జిల్లా వివరాలు ఇవ్వండి

స్టెప్ 6: సేవ్ & సబ్మిట్
నమోదు చేసిన వివరాలు చెక్ చేయండి
“Submit” పై క్లిక్ చేయండి

స్టెప్ 7: రిఫరెన్స్ నంబర్ సేవ్ చేసుకోండి
సబ్మిట్ చేసిన తర్వాత ఒక Acknowledgement / Reference Number వస్తుంది
దీన్ని భద్రంగా సేవ్ చేసుకోండి

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *