Breaking News

ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. అంబేద్కర్  పాత్ర విశిష్టమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన మార్గం దేశానికి చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐబీఎస్​పీ నాయకులు కళ్యాణ్, జిల్లా ట్రెజరర్ చిన్న ఆనంద్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి, సత్తు శ్రీను, రఘు ప్రసాద్, సుబ్బారావు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *