భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-వేమగిరిలో ఘనంగా డా. బి. ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు.. పాల్గొని ఘన నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా “జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్” అంటూ నినదించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *