-వైసీపీకి మంత్రి సవిత సవాల్
-మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు
-వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు
-ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుంచి తరిమేశారు…
-రోడ్డేసిన తరవాతే బూచేపల్లికి వచ్చా…
-రహదారులే అభివృద్దికి రాచమార్గాలు : మంత్రి సవిత
-పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి సవిత హర్షం
-సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
-ఏరోస్పేస్ పరిశ్రమ రాకలో వేలాది మందికి ఉపాధి
-మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు : మంత్రి సవిత
గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
‘రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం… రహదారులే అభివృద్దికి రాచమార్గాలు.. బూచేపల్లికి రోడ్డు వేసిన తరవాతే వస్తానని చెప్పాను…ఈరోజు చేసి చూపించాను…గత పాలకులు మీటరు రోడ్డు కూడా వేయలేదు… కూటమి ప్రభుత్వం ఏర్పడిన చేసిన అభివృద్ధిపై నేను చర్చకు ఛాలెంజ్ చేస్తున్నాను… ప్లేస్ మీరు డిసైడ్ చేసినా… నేను డిసైడ్ చేసినా చర్చకు సిద్ధం…’ అని వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సవాల్ విసిరారు. అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసేందేమీ లేదని, ఆయనదంతా చోరీ క్రెడిట్ అని , తమది అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. ఆయన చోరీ క్రెడిట్ ను చోరీ చేయాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఎవరూ లేరన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం రూ.60 లక్షలతో కరావులపల్లి నుంచి కరావులపల్లి తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డు, రూ.2.47 కోట్లతో బూచేపల్లి నుంచి కొత్తపల్లి వరకు నిర్మించిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలకు, అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రోడ్లేలేని గ్రామాలకు బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తున్నారన్నారు. రోడ్లతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రోడ్డేసి మీ ఊరికి వచ్చా…
గత ఎన్నికల్లో తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆనాడు బూచేపల్లి గ్రామస్తులు తన దృష్టి తీసుకొచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆనాడే తాను చెప్పానని, రోడ్డేసిన తరవాత బూచేపల్లికి వస్తాయని స్పష్టం చేశానని మంత్రి సవిత తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రూ.2.50 కోట్లతో బూచేపల్లికి బీటీ రోడ్డు నిర్మించామన్నారు. బూచేపల్లి పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి బూచేపల్లి గ్రామస్తులు సహకారమందించారన్నారు. వారి రుణం తీర్చుకోలేనిదాని, బూచేపల్లి అభివృద్ధి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు రండి…
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంపైగాని, పులివెందుల, ధర్మవరంలో అభివృద్ధి గురించిగాని తాను చర్చకు సిద్ధమని, వైసీపీ నాయకులు ముందుకు రావాలన్నారు. ప్లేస్ వారికి చెప్పమంటారా… తనకే చెప్పమంటారా…? అంటూ మంత్రి సవిత ఛాలెంజ్ చేశారు. గతంలో వలస పక్షుల పాలనలో పెనుకొండ నియోజక వర్గంలో అభివృద్ధి జాడేలేదన్నారు. మీటరు రోడ్డు కూడా వేయలేదన్నారు.
జగన్ చోరీ క్రెడిట్ మాకు అక్కర్లేదు…
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ, అయిదేళ్ల పాలనలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. చివరికి పెట్టుదారులను కూడా వదల్లేదని, వారిని కూడా బెడిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేసిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా… ఒక సాగునీటి కాలువ కూడా పూర్తి చేశారా..? అని నిలదీశారు. జగన్ ఏమి చేశారని, క్రెడిట్ చోరీకి పాల్పడడానికి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డిది అంతా చోరీ క్రెడిట్ ననే, ఆ క్రెడిట్ తమకు అక్కర్లేదని అన్నారు. ఆయన హయాంలో ఏయే ఒప్పందాలు జరిగాయో..? వివరించాలని మంత్రి నారా లోకేశ్ అడిగారని, దానికి వైసీపీ నేతలు ఎందుకు నోరెత్తడం లేదని మంత్రి సవిత ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాకతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇప్పటికే కియా, బెల్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. తాజాగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రానుండడంతో, ఈ ప్రాంతం రూపు రేఖలే మారిపోనున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడిని కొనియాడారు. సోమందేపల్లి, సత్యసాయి జిల్లాల తరఫున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాతు తెలియజేశారు. అంతకుముందు బీటీ రోడ్ల ప్రారంభొోత్సవానికి విచ్చేసిన మంత్రి సవితకు బూచేపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్మామ్ ప్రసాద్. ఇతర అధికారులు, ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News