Breaking News

ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక లేఖ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అత్యవసర లేఖ రాసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రబీ సీజన్ 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి సుమారు 4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా కొనసాగుతున్నాయని, జూన్ 2026 వరకు కొనసాగే గరిష్ట రాకల సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల్లో మొక్కజొన్న సాగుపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యే పరిస్థితి నెలకొంటోందని, వారు నిర్బంధ విక్రయాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలు రైతుల ఆదాయం మరియు ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆమె వివరించారు.
ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా:
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద ప్రైస్ డెఫిషెన్సీ పేమెంట్ (PDPS) ను మొక్కజొన్న పంటకు అమలు చేయడానికి NAFED కు అనుమతి మంజూరు చేయాలని, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌తో సమన్వయం చేయాలని సూచించారు.

ప్రస్తుత 50:50 నిధుల భాగస్వామ్యానికి బదులుగా, అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 100% ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం భరించేలా అనుమతించాలన్నారు.
పథకం పరిధిని ప్రస్తుత 25 శాతం నుండి 100 శాతం మొక్కజొన్న ఉత్పత్తి వరకు విస్తరించాలని కోరారు.
గరిష్ట మార్కెట్ రాకల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని జూన్ 2026 వరకు కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

సమయానికి తీసుకునే నిర్ణయం రైతులకు ఉపశమనం కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ధరల స్థిరత్వాన్ని కూడా కాపాడుతుందని దగ్గుబాటి పురందేశ్వరి గారు విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *