Breaking News

నేడు (మే 4) పీజీఆర్ఎస్ యథావిధిగా

-జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల స్వీకరణ
-కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు (మే 4) పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) సోమవారం సాధారణంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అమరావతి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 4న నిర్వహించే సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా మున్సిపల్, మండల కేంద్రాల్లో యథావిధిగా నిర్వహించే పీజీఆర్ఎస్‌కు తహసీల్దార్లు, ఇతర మండల అధికారులు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరవుతారని వివరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని సూచించారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీలు స్వీకరించడం, అలాగే అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే https://Meekosam.ap.gov.in⁠� ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *