Breaking News

Tag Archives: rajamandri

అనుమతి లేకుండా ఇసుక త్రవ్వకాలకు వినియోగించిన 13 డ్రెడ్జింగ్ బోట్లు సీజ్

-సోషల్ మీడియాలో 28 బోట్లు పట్టుకుని 15 బోట్లు వదిలేశారన్న ప్రచారం అవాస్తవం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోటిలింగాల డిసిల్టేషన్ రీచ్‌లో సోమవారం నిర్వహించిన సంయుక్త తనిఖీలో అనుమతి లేకుండా ఇసుక త్రవ్వకాలు, రవాణా కార్యకలాపాలకు వినియోగిస్తున్న 13 డ్రెడ్జింగ్ బోట్లను అధికారులు సీజ్ చేశారు. నూతన ఇసుక విధానం–2024 మరియు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సమక్షంలో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు, వారి సాంకేతిక …

Read More »

వసతి గృహ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఉన్న ఎనిమిది ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం బాలుర వసతి గృహం నెం.1లో విద్యార్థులకు ట్రంకు బాక్సులు, దుప్పట్లు, బ్లాంకెట్లు, ప్లేట్లు, కటోరాలు, గ్లాసులు, స్వెటర్లు, నైట్ డ్రెస్సులు, టర్కీ టవల్స్ తదితర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి. గాయాజుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం వసతి …

Read More »

పదిేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యకు పరిష్కారం

-పీజీఆర్ఎస్ ద్వారా వేములూరు గ్రామస్తులకు ఊరట -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22-ఎ నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేములూరు గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, …

Read More »

సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి నూతన జీవం

-117 వరద గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీకారం -గోదావరి డెల్టా భద్రత, సాగునీటి భవిష్యత్తుకు చారిత్రాత్మక అడుగు ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ, తాగునీటి అవసరాలకు దాదాపు రెండు శతాబ్దాలుగా జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సుమారు ₹152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

గోదావరి పుష్కరాలు– 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం

– పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ, పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా, ఒక్క రోజే 68 లక్షల మంది స్నానాలు చేసిన నేపథ్యంలో, ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డా. పి. …

Read More »

ఏడాది ముందే పుష్కర వ్యూహం… గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ

-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు -ఆరు జిల్లాల్లో భక్తులకు అత్యున్నత సౌకర్యాలు – భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి -రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి. నారాయణ, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందనీ …

Read More »

నిడదవోలులో విశాఖ – ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ మంజూరు

-కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం–ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) ఎక్స్‌ప్రెస్‌ (18519/18520)కు హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ …

Read More »

పేదల ఆరోగ్యానికి కొండంత అండ ‘సీఎంఆర్ఎఫ్’: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పట్టణం లోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో రూ.71.81 లక్షల విలువైన 125 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -నియోజకవర్గంలో ఇప్పటివరకు 998 మంది లబ్ధిదారులకు రూ.6.79 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన 125 మంది …

Read More »

ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం సందర్భంగా గోడపత్రిక (పోస్టర్) ప్రదర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు గారి ఆదేశాల మేరకు, కళాశాలలో చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సరం వైద్య విద్యార్థులు ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జూన్ 19) గోడపత్రిక (పోస్టర్) ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2026 సంవత్సరానికి ప్రకటించిన నినాదం “Closing the Survival …

Read More »

రాజమహేంద్రవరం సుడిగాలి పర్యటన విజయవంతం… : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈరోజు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని వ్యవసాయ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధి లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొదటగా, ICAR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పీవీఎన్ మాధవ్, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, …

Read More »