మధురపూడి, దోసకాయల పల్లిలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం కొరుకొండ మండలంలోని మధురపూడి, దోసకాయల పల్లి గ్రామాల్లో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
రైతుల సమావేశంలో డా. కె. వసంత భాను (ప్రొఫెసర్ & హెడ్, కీటక శాస్త్ర విభాగం) మాట్లాడుతూ వ్యవసాయంలో సుస్థిర కీటక నియంత్రణ పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, మట్టి ఆరోగ్య కార్డుల ప్రాముఖ్యత గురించి వివరించారు.

డా. కె.ఎం. దక్షిణ మూర్తి (ప్రొఫెసర్ & హెడ్, అగ్రానమీ విభాగం) నీటి సంరక్షణ సాంకేతికతలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానాలు, లాభదాయక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు, 15 మంది రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అవగాహన ప్లకార్డులు, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తూ రైతుల్లో చైతన్యం కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *