-నిడదవోలులో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
-మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. పాల్గొన్న మంత్రి దుర్గేష్
-ఎండల్లో దాహార్తిని తీర్చడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మానవత నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో వేసవికాలాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి, మండుతున్న ఎండల్లో దాహార్తిని తీర్చే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు. ప్రజా సేవే పరమావధిగా భావించి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవత సంస్థ సభ్యులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.
Prajavartha Online Telugu News