– కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 16న బొమ్మూరు కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, స్థానిక యువతకు జిల్లాలోనే ఉపాధి అవకాశాలు అందించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు పొందాలని సూచించారు.
జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష మాట్లాడుతూ, జూన్ 16వ తేదీ ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం రూరల్ కలెక్టరేట్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రివేణి గ్లాస్, ఠాగూర్ లాబొరేటరీస్, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్, పాటిల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డి-మార్ట్, కిసాన్ మార్ట్, ఇండియన్ డైరీ ఎక్విప్‌మెంట్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్, శ్రీ భవాని క్యాస్టింగ్స్ తదితర సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, బీటెక్ (మెకానికల్) అర్హత కలిగిన 19 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు employment.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, సీపీవో ఎల్. అప్పాలకొండ, జిల్లా ఉపాధి కల్పన & నైపుణ్యాభివృద్ధి అధికారి సి.హెచ్. శిరీష, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పి. వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News