-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నీట్ (NEET) పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3242 మంది పరీక్షలకు హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల వారీగా వివరాలు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు/ హాజరైన వారు/ హాజరుకానివారు.
రాజమహేంద్రవరం అర్బన్ – ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల: 576 / 557 / 19
రాజమహేంద్రవరం అర్బన్ – గవర్నమెంట్ కాలేజ్ (ఆటానమస్): 528 / 514 / 14
రాజానగరం – ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల: 504 / 490 / 14
రాజమహేంద్రవరం అర్బన్ – ఎస్కేవీటీ ఈఎం గవర్నమెంట్ హై స్కూల్: 360 / 347 / 13
రాజమహేంద్రవరం అర్బన్ – కేంద్రియ విద్యాలయ, ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్: 360 / 349 / 11
రాజమహేంద్రవరం అర్బన్ – గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్: 288 / 281 / 7
రాజమహేంద్రవరం అర్బన్ – నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్: 264 / 255 / 9
రాజనగరం – ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్: 240 / 235 / 5
రాజమహేంద్రవరం అర్బన్ – దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్: 221 / 214 / 7
పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పరీక్షల నిర్వహణ తీరును రాజమండ్రి ఇంచార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, మెడికల్ క్యాంపులను తనిఖీ చేసి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పరీక్షా కేంద్రాల ఇంచార్జులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద హాల్ టికెట్లను తనిఖీ చేసి, ఫేస్ రికగ్నిషన్ మరియు బయోమెట్రిక్ గుర్తింపు ప్రక్రియల ద్వారా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరిగింది.
Prajavartha Online Telugu News