-పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి -ఎస్సీ, ఎస్టీల ఆర్థిక సాధికారతకు సమగ్ర కార్యాచరణ -ఏజెన్సీ ప్రాంతాల్లో అవకాశాలు కాదు… అవగాహన లేకే వెనుకబాటుతనం -ఎస్సీ, ఎస్టీ హైపవర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ వేగంగా జరిపి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా కోర్టుల్లో పరిష్కరించేలా చూడాలని, ప్రత్యేక సెషన్ కోర్టులు, స్పెషల్ …
Read More »Daily Archives: September 5, 2026
పే-రివిజన్ కమిషన్ నియమిస్తాం… 2 పెండింగ్ డీఏలను విడుదల చేస్తాం
-గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరణ -ఈహెచ్ఎస్ స్ట్రీమ్ లైన్… 2022 ఏడాది సరెండర్ లీవుల విడుదల -ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు -ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగుల హర్షం.. ప్రభుత్వానికి సహకరిస్తామని వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పెండింగులో ఉన్న 4 డీఏల్లో 2 డీఏల విడుదలకు …
Read More »భవిష్యత్ నిర్మాతలు టీచర్లే
-ప్రతి పాఠశాలకూ ఓ బ్రాండ్ ఉండాలి -దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ -ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానం భర్తీ కాదు -సున్నితమైన పరిస్థితుల్లో విద్యాబోధన టీచర్లకు ఓ సవాల్ -ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కోర్సులను రీస్ట్రక్చరింగ్ …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈ ఓ సీనా నాయక్ , ఆలయ చైర్మన్ బొర్రా రాధ కృష్ణ (గాంధీ ), ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి …
Read More »వైసీపీ నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
-రెండేళ్లలో ఒక్క రూపాయి ఛార్జీ పెంచలేదు -6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ -కూటమి అభివృద్ది, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి -స్థానిక సంస్థల్లో విజయంతోనే మరింతగా రాష్ట్ర అభివృద్ధి – ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నాశనమైన విద్యుత్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ …
Read More »గిరిజనుల జన్యు రక్త వ్యాధుల ముందస్తుగానే గుర్తింపు
-తలసేమియా, సికిల్‌సెల్ కోసం -రాష్ట్రంలోనే ఉన్న ఏకైక ప్రత్యేక ల్యాబ్‌లో 3 నెలల్లో 121 పరీక్షలు -94 మందిలో సమస్యల గుర్తింపు.. -వైజాగ్ లోని KGH కేంద్రంగా పరీక్షలు, చికిత్స ఉచితం.. -గిరిజనుల ఆరోగ్యానికి భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల ఆరోగ్యానికి మరింత భరోసా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్ వంటి జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ కంపిటెన్స్ (సీఓసీ) …
Read More »కేంద్ర సర్వీస్ కి వెళ్తున్న AP SWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్‌కు ఆత్మీయ వీడ్కోలు
-కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : AP SWREIS కార్యదర్శిగా సేవలందించిన ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్ బదిలీపై NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా తాడేపల్లిలో శనివారం నాడు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై, ప్రసన్న వెంకటేష్‌ను ఘనంగా …
Read More »జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం
-2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు -రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు -రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు …
Read More »జువైనైల్ జస్టిస్ చట్టం–2015 అమలుకు దశాబ్దం పూర్తి
-భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశం -బాలల సంరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత…. -హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జువైనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం–2015 అమలుకు దశాబ్దం పూర్తైన సందర్భంగా “చట్టం అమలు – దశాబ్దం ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణ” అంశంపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని శనివారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి …
Read More »నేడు రెండో రోజు జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులు రెండో రోజు ఆదివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు, నెల్లూరు నగరంలోని డెస్క్ జర్నలిస్టులు, ఆసక్తిగల జర్నలిస్టులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 …
Read More »
Prajavartha Online Telugu News