Breaking News

కేంద్ర సర్వీస్ కి వెళ్తున్న AP SWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్‌కు ఆత్మీయ వీడ్కోలు

-కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
AP SWREIS కార్యదర్శిగా సేవలందించిన ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్ బదిలీపై NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా తాడేపల్లిలో శనివారం నాడు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై, ప్రసన్న వెంకటేష్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. AP SWREIS కార్యదర్శి కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్ అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా AP SWREIS‌ను మరింత బలోపేతం చేయడంలో ఆయన అందించిన సహకారం చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. బదిలీపై NTA బోర్డు డైరెక్టర్‌గా చేపట్టనున్న కొత్త బాధ్యతల్లో కూడా సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. ఎం. నాయక్, డిప్యూటీ డైరెక్టర్ వీ లావణ్య వేణి, AP SWREIS అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని ప్రసన్న వెంకటేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *