Breaking News

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని సాధించడం మంత్రి అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకతను చాటుతున్నారని అభినందించారు. పారదర్శకత, వేగం, సమర్థతకు పెద్దపీట వేస్తూ మంత్రి అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్న పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం

-సుదీర్ఘంగా వివాదంలోని రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి -ఏపీకి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *