Breaking News

Daily Archives: September 8, 2026

రేపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ -రైతులతో ముఖాముఖి… గ్రామసభలో పాల్గొననున్న సీఎం -22-A నిషేధిత జాబితా నుంచి గ్రౌండ్ రెంట్ స్థలాల విముక్తికి కీలక అడుగు -1,416 కుటుంబాలకు లబ్ధి కలిగించే ప్రతిపాదనలు సిద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల మధ్యే పాలన సాగిస్తూ ప్రతి నెలా వివిధ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ హక్కులకు భరోసా కల్పించే …

Read More »

సరసమైన ధరల్లో నిత్యావసరాలు

-కిలో ఉల్లి రూ.32లకే అందించేలా ఏర్పాటు -115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా విక్రయాలు -చౌకడిపోల్లో రాయితీపై కిందిపప్పు, పామాయిల్ -10 శాతం నూకలు బియ్యం నమూనా దేశవ్యాప్తంగా అమలు -ఖరీఫ్ ధాన్యం సేకరణ పక్కాగా అమలు -రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్ లో నిత్యావసర ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంచేలా కూటమి ప్రభుత్వం పని …

Read More »

పరిశ్రమలు తమ ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి

-స్థానిక వృక్ష జాతులతో గ్రీన్‌ బెల్ట్‌ను మరింత విస్తరించాలి -నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి -మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలి -దివిస్‌లో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలపై ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు సమీక్ష -ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటిన నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ ‌బెల్ట్‌ను మరింత విస్తరించి, స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ …

Read More »

మూడు రోజుల జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పరివర్తన, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐఏఎస్‌, సెప్టెంబర్‌ 9న ముంబయిలో జరిగే ప్రతిష్ఠాత్మక ‘ఐఎఫ్‌ఏటీ ఇండియా–2026’ సదస్సుకు విశిష్ట అతిథిగా, వక్తగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పట్టణ పరివర్తన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. పుర పాలనా సంస్కరణలు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవల అందజేత, పట్టణ స్థానిక సంస్థల్లో సామర్థ్యాల పెంపు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలతో పట్టణ …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఘనంగా ఐలా చైర్మన్ అన్నే శివ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ అన్నే శివ నాగేశ్వరరావు, 67వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మాజీ ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్, కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కమిటీ సభ్యులు మరియు వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా సత్కరించారు. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా పుట్టినరోజును పురస్కరించుకుని కార్మికుల పట్ల తనకున్న మక్కువను అన్నే శివ నాగేశ్వరరావు, చాటుకున్నారు. ఐలాలో పనిచేసే మహిళా కార్మికులకు పట్టుచీరలు పురుష వర్కర్లకు …

Read More »

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, తెలిపారు. ఏపీపీటీడీ కార్మిక పరిషత్‌ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం మంగళవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు ర్యాలీగా గాంధీనగర్ స్థానిక శ్రీరామఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. అనంతరం జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వి. శేషగిరిరావు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ బిల్డింగ్‌ …

Read More »

నగరంలో విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో దోమల నియంత్రణకు విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం సత్యనారాయణపురం మధ్యకట్ట ప్రాంతంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను బోట్ల సహాయంతో తొలగించడంతో పాటు, కాలువ గట్లపై యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మందులను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ …

Read More »

క్రమ తప్పకుండా ప్రతిరోజు త్రాగు నీటి పరీక్షలు నిర్వహించి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రమ తప్పకుండా ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించి ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని మాత్రమే సరఫరా చేసేటట్టు అధికారుల చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి అన్నారు. ఎమినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రతిరోజు తమ తమ వార్డుల్లో తమ తమ సెక్రటేరియట్ పరిధుల్లో నీటి పరీక్షలు కచ్చితంగా నిర్వహించి శుద్ధమైన త్రాగునీరు అందుతుందా లేదా అని నిర్ధారించుకోవాలని అన్నారు. ఎక్కడైనా త్రాగునీరు కలిసితం అవుతుందన్న సందేహం ఉన్న వెంటనే అధికారుల …

Read More »

గవర్నర్‌పేటలో హోటళ్లు, మెస్‌లపై ముమ్మర తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళవారం ఉదయం గవర్నర్‌పేట ప్రాంతంలో హోటళ్లు, మెస్‌లు, ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గవర్నర్‌పేటలోని రామయ్య మెస్, కోటయ్య మెస్, సుబ్బయ్య మెస్, హవెలి హోటల్ తదితర ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, వంటగది పరిశుభ్రత, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు …

Read More »