Breaking News

క్రమ తప్పకుండా ప్రతిరోజు త్రాగు నీటి పరీక్షలు నిర్వహించి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రమ తప్పకుండా ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించి ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని మాత్రమే సరఫరా చేసేటట్టు అధికారుల చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి అన్నారు.

ఎమినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రతిరోజు తమ తమ వార్డుల్లో తమ తమ సెక్రటేరియట్ పరిధుల్లో నీటి పరీక్షలు కచ్చితంగా నిర్వహించి శుద్ధమైన త్రాగునీరు అందుతుందా లేదా అని నిర్ధారించుకోవాలని అన్నారు. ఎక్కడైనా త్రాగునీరు కలిసితం అవుతుందన్న సందేహం ఉన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి కేవలం శుద్ధమైన త్రాగునీరే ప్రజలకు అందేటట్టు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డెప్యూటీ ఇంజనీర్లు క్రమ తప్పకుండా నిర్ణీత సమయాల్లో వాటర్ ట్యాంకులు కడగటం, స్కవరింగ్ లు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరోవైపు నగరంలో నిరంతరాయంగా డీసిల్టింగ్ పనులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలని, కాలువల ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న వేసవి కాల దృశ్య తమ తమ పరిధిలో వారు తీసుకుంటున్న చర్యలపై ఒక ప్రణాళికను సిద్ధం చేసి త్రాగునీటిలో ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయుటకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు వంటి విషయాలపై నివేదికను సమర్పించాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *