Breaking News

ఘనంగా ఐలా చైర్మన్ అన్నే శివ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోనగర్ ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ అన్నే శివ నాగేశ్వరరావు, 67వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మాజీ ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్, కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కమిటీ సభ్యులు మరియు వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా సత్కరించారు.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా పుట్టినరోజును పురస్కరించుకుని కార్మికుల పట్ల తనకున్న మక్కువను అన్నే శివ నాగేశ్వరరావు, చాటుకున్నారు. ఐలాలో పనిచేసే మహిళా కార్మికులకు పట్టుచీరలు పురుష వర్కర్లకు ప్యాంటు షర్టులతో పాటు పని సమయంలో ధరించేందుకు టీ-షర్టులను పంపిణీ చేశారు. ఆయన కేవలం చైర్మన్‌గానే కాకుండా ఒక దాతగా ఎందరో మెకానిక్కులకు కార్మికులకు అండగా నిలుస్తున్నారని సహచరులు కొనియాడారు. గతంలో అనారోగ్యంతో ఉన్న ఆటోనగర్ కార్మికుల వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల నుండి రూ.10 లక్షల వరకు వెచ్చించిన సందర్భాలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. అలాగే కార్మికుల భద్రత కోసం ఏటా లక్షలాది రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ ఒక ఉన్నత పాఠశాలను కూడా నిర్మించినట్లు తెలిపారు.
ఆటోనగర్ సమూల ప్రక్షాళన – అభివృద్ధి పనుల వేగం
ఈ సందర్భంగా ఆటోనగర్ అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. చెత్త నిర్మూలన గత కొద్ది రోజుల్లోనే సుమారు 350 టన్నుల చెత్తను క్లియర్ చేసినట్లు మరో 10 రోజుల్లో మొత్తం ఆటోనగర్‌ను శుభ్రం చేస్తామని ప్రకటించారు. మౌలిక సదుపాయాలుసుమారు రూ. 14 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకుకు గంటకు 500 లీటర్ల సామర్థ్యం గల ఆర్‌ఓ (ఆర్వో) ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పైపులైన్ కనెక్షన్లు ఇచ్చి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. గృహ నిర్మాణం గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇబ్బందులు ఉన్నాయని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 60 వేలకే సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఆటోనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని శివనాయన పేర్కొన్నారు. కార్మికులకు మున్సిపాలిటీల్లో ఇచ్చే విధంగా రూ. 21,000 వేతనం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారిని కూడా పిలిపించి కేక్ కట్ చేయించడం ఆయన పనితీరుకు నిదర్శనమని సభికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, ప్లాట్ యజమానులు మరియు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *