నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులు రెండో రోజు ఆదివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు, నెల్లూరు నగరంలోని డెస్క్ జర్నలిస్టులు, ఆసక్తిగల జర్నలిస్టులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు.
Tags nellore
Check Also
ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం
-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …
Prajavartha Online Telugu News