Breaking News

Daily Archives: September 5, 2026

బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి

-జర్నలిస్టులకు నిరంతర శిక్షణ ఎంతో అవసరం -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా -ప్రజా ప్రయోజనమే వార్తకు ప్రధాన గీటురాయి -సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాస్తవాలను ధృవీకరించిన అనంతరం బాధ్యతాయుతంగా వార్తలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జర్నలిస్టులకు సూచించారు. శనివారం జడ్పి సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు …

Read More »

ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి డిస్కమ్ పరిధిలోని CGMs ,GMs ,SEs ,EEs తో సమీక్షా సమావేశం

-వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రధాన లక్ష్యం – గౌరవ సీఎండీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి అధ్యక్షతన విజయవాడలోని విద్యుత్ నిలయంలో డిస్కమ్ పరిధిలోని CGMs ,GMs ,SEs ,EEs తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, …

Read More »

గిరిజనుల జన్యు రక్త వ్యాధుల ముందస్తుగానే గుర్తింపు

-తలసేమియా, సికిల్‌సెల్‌ కోసం -రాష్ట్రంలోనే ఉన్న ఏకైక ప్రత్యేక ల్యాబ్‌లో 3 నెలల్లో 121 పరీక్షలు -94 మందిలో సమస్యల గుర్తింపు.. -వైజాగ్ లోని KGH కేంద్రంగా పరీక్షలు, చికిత్స ఉచితం.. -గిరిజనుల ఆరోగ్యానికి భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల ఆరోగ్యానికి మరింత భరోసా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ కంపిటెన్స్‌ (సీఓసీ) …

Read More »

డెమోక్రటిక్ సంగ ఆధ్వర్యంలో ‘యంగ్ లీడర్స్ ఫర్ సోషియల్ చేంజ్’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డెమోక్రటిక్ సంగ ఆధ్వర్యంలో ‘యంగ్ లీడర్స్ ఫర్ సోషియల్ చేంజ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం బందరురోడ్డులోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ, డెమోక్రటిక్ సంగ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాజం, పలు ప్రభుత్వ విభాగాలపై అవగాహన కల్పిస్తుండడం మంచి విషయమన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సమాజం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కోర్టులు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఎలా పని …

Read More »

శ్రీ శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామివారి జాతరలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : దేవరకద్ర నియోజకవర్గం, మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామివారి జాతర సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా ముచ్చటించారు.. గ్రామ ప్రజలు, భక్తులు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో …

Read More »

సద్గురు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురుదేవులను సత్కరిం చుకోవటం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని శ్రీషిర్డీసాయిబాబా మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పూనూరు సుబ్బరామరెడ్డి మెమోరియల్ సద్గురు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, పూనూరు సుబ్బరామరెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీ

– పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయ కమిటీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలను సన్నద్ధం చేసేందుకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక సమన్వయకర్తను, ముగ్గురు సమన్వయ కమిటీ సభ్యులను నియమించారు. వీరికి సహాయక బృందంగా ఆ పార్లమెంట్ పరిధిలోని ప్రతి శాసన సభ నియోజక వర్గం …

Read More »

గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయి తాగు నీటి భద్రత దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు

-తాగు నీటి వ్యవస్థల బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగంపై దృష్టి -రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ పనులు -లక్షలాది మందికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు -ఇప్పటికే రూ. 26,000 కోట్లతో జేజేఎం-అమరజీవి జలధారల పనులు -గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ తాగు నీటి పథకాలు -రంగు మారిన నీరు, నాణ్యతలేని నీటి సరఫరాతో ఇబ్బందులుపడిన ప్రజలకు ఉపశమనం -సమస్య తీవ్రత, స్థానిక అవసరాల ఆధారంగా పనులకు ప్రాధాన్యత -ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో వేగవంతంగా అమలవుతున్న పునరుద్ధరణ చర్యలు -గ్రామీణ …

Read More »

దసరా శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రిపై పకడ్బందీ ఏర్పాట్లు – భక్తుల సౌకర్యాలకే అత్యున్నత ప్రాధాన్యం

-అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాల నిర్వహణ- ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి -సామాన్య భక్తులకే పెద్ద పీట – జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ. -క్యూలైన్లలో దర్శనం సమయం తెలిపే డిస్‌ప్లేలు, 4D డ్రోన్ల నిఘా, 3 ప్రాంతాల్లో హోల్డింగ్ ఏరియాలు: పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు -మహా మండపంలో ఘనంగా దసరా ఉత్సవాల ఉన్నతస్థాయి సమన్వయ సమీక్షా సమావేశం ​ఇంద్రకీలాద్రి 05 సెప్టెంబర్ 2026: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా …

Read More »

“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం బబ్బూరి గ్రౌండ్స్ నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, …

Read More »