హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
దేవరకద్ర నియోజకవర్గం, మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామివారి జాతర సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా ముచ్చటించారు.. గ్రామ ప్రజలు, భక్తులు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News