Breaking News

Tag Archives: hydarabad

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి….

-ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ కాంగ్రెస్ శ్రేణులమంతా ఐక్యతతో పోరాడుతాం.. -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు నిరసనగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎం.జి. రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అదే సందర్భంగా ఎం.జి. రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ …

Read More »

గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నేడు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రజలకు, …

Read More »

ముసారాంబాగ్ మూసీపై వారధి..

-తెలంగాణ అభివృద్ధికి సారథి.. -మన రేవంతన్న..! -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ను ప్రారంభించారు.. …

Read More »

లేపాక్షి ఎంపోరియం షోరూంను సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం షోరూంను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎంపోరియంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై షోరూం సిబ్బందితో చర్చించారు. లేపాక్షి ద్వారా రాష్ట్రంలోని కళాకారులు తయారు చేస్తున్న హస్తకళా …

Read More »

చిరంజీవి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. కళారంగం, సినీ రంగం ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు తన …

Read More »

చిరంజీవి సమయస్ఫూర్తి.. సతీశ్‌రెడ్డి సేవాస్ఫూర్తి

-కళా, రక్షణ రంగాలకు వారి కృషితో తెలుగు వారికి ఘన కీర్తి -చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా -హైదరాబాదులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : కళారంగంలో మెగాస్టార్‌ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కొనియాడారు. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోగా, సతీశ్‌రెడ్డి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మేటి శాస్త్రవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. హైదరాబాద్ …

Read More »

సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నారా రోహిత్ జన్మదిన వేడుకలు

-ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు – 329 యూనిట్ల రక్త సేకరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విలక్షణ నటుడు నారా రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ వంటి సంప్రదాయ వేడుకలతో పాటు సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాల్లో అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మూడు కేంద్రాల్లో …

Read More »

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ని ప‌రామ‌ర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైదరాబాద్ లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం వెళ్లిన లోకేష్‌ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శ‌స్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు.

Read More »

హైదరాబాద్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా – ప్రజా దర్బార్ విజయవంతం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో జాబ్ మేళా మరియు ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ …

Read More »