Breaking News

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 70కిపైగా ప్రతిష్టాత్మక డెవలపర్లు రూపొందించిన రేరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అన్వితా డైరెక్టర్లు బొప్పన నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు టాలెంట్ టెస్ట్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *