Breaking News

ఎక్సైజ్ కమీషనరేట్ లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం

-పతాక ఆవిష్కరణ గావించిన నిషాంత్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీశాఖ కమీషనర్ కార్యాలయం ఆవరణ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . కమిషనర్ నిషాంత్ కుమార్ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గత సంవత్సరం సాధించిన ప్రధాన విజయాలను ఐదు నిమిషాల ఆడియో-విజువల్ ప్రదర్శించారు. మంచి పని తీరు ప్రదర్శించిన 193 అధికారులు, సిబ్బందికి కమెండేషన్ అవార్డులు అందజేయబడ్డాయి. కమిషనర్ నిషాంత్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామ సైనికుల త్యాగాలను గుర్తు చేశారు ఒకే కమాండ్ లైన్ పున:స్థాపన, కమ్యూనిటీ రిజర్వేషన్లతో కొత్త షాప్ పాలసీ, నాణ్యమైన, సరసమైన మద్యం అందజేత, నవోదయం 2.0 కింద 50 శాతం జిల్లాలను నాటు సారా రహితం గా మార్చడం, డిజిటల్ ఎఫ్ ఐ ఆర్ , ఎక్సైజ్ యాప్, క్యూ ఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ వంటి శాఖ పరమైన అంశాలను వివరించారు.

రాహుల్ దేవ్ శర్మ 14 జిల్లాలు ఇప్పటికే నాటు సారా రహితంగా ఉన్నట్లు గుర్తుచేసి, మిగతా జిల్లాలకూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్ డి పి ఎల్ మద్యం ప్రవాహాన్ని నియంత్రించిన ఫీల్డ్ అధికారుల కృషిని ప్రశంసిస్తూ, ప్రజల సహకారం మరియు నిరంతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అవసరాన్ని వివరించారు. కార్యక్రమం పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు సేవ చేయడం అనే ప్రమాణంతో ముగిసింది. మరోవైపు విభాగం కాంటిజెంట్ రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ లో కార్యక్రమంలో ప్రదర్శన చేసి, విభాగానికి గౌరవం తెచ్చింది. అడిషనల్ కమిషనర్ ఎం. దేవా కుమార్, జాయింట్ కమిషనర్లు అనసూయా దేవి, అరుణ రావు, ఒ ఎస్ డి ఏ. చంద్రశేఖర్ నాయుడు, ఏపిబిసిఎల్ జిఎం షరన్ కుమార్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *