Breaking News

Daily Archives: September 24, 2026

బుడమేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు

-వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది -10 వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించాం -అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం: ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని గురువారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 10 …

Read More »

వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలతో – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమా పరామర్శ

-లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ MLA బొండా ఉమా -ఇళ్లలోకి చేరిన నీటిని మోటార్లతో యుద్ధప్రాతిపదికన తొలగింపు, కాలువల్లో గుర్రపు డెక్కలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  వెంటనే స్పందించారు. గురువారం 63వ డివిజన్ …

Read More »

చిన్నారి లోహిత్య పుట్టినరోజు సందర్భంగా ఠాగూర్ గ్రంథాలయం కు పుస్తకాల బహూకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని టాగోర్ స్మారక గ్రంథాలయానికి లోహిత్యా 23.9.26 న తన పుట్టినరోజు సందర్భంగా చిన్నారుల కోసం సుమారు రూ.5,000 విలువైన పుస్తకాలను బహూకరించారు. ప్రస్తుతం ఖతార్‌లో నివసిస్తున్న లోహిత్యా, భారతదేశానికి వచ్చిన సందర్భంగా తన తల్లిదండ్రులతో కలిసి టాగోర్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి వారితో మాట్లాడుతూ చిన్నారుల పఠనాభిరుచిని పెంపొందించేందుకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయానికి బహుకరించాలని కోరగా వారు నిన్న లోహిత్య పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలను అందజేశారు. …

Read More »

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఎల్‌.బీ.ఆర్‌.సీ.ఈ లో విద్యాసంస్థల బస్సు డ్రైవర్ల కోసం రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. …

Read More »

ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి తగిన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గడ్డిపాడు రైల్వే గేటు దగ్గర ఈ నెల 26న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి జిఎంసి నుండి తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం గడ్డిపాడు రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంఖుస్థాపన జరగనున్న నేపధ్యంలో శంఖుస్థాపన, సభావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు నిర్దేశిత …

Read More »

గుంటూరు నగరంలో తుఫాన్ ప్రభావంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

-గురువారం ప్రజారోగ్య కార్మికులకు సెలవు ఉన్నప్పటికీ, 3 వేల మంది విధుల్లోనే -250 అధికారులు కూడా క్షేత్ర స్థాయి విధుల్లో -17 జేసీబీలు, 8 రోబోలు, 8 ఆయిల్ ఇంజిన్లు, 12 ట్రీ కటింగ్ మెషిన్లతో సిద్దంగా యంత్రాంగం -వర్షం నీరు 30 నిమిషాల్లోగా బెయిల్ అవుట్ లక్ష్యంగా ప్రణాళిక -డ్రైన్లకు అడ్డంపడి ఓవర్ ఫ్లోకి ప్రధాన కారణంగా ఉన్న ప్లాస్టిక్ ని ప్రజలు వినియోగించవద్దు -కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల …

Read More »

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు -​సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను ఆదుకోవాలి -కుప్పంలో ప్రకటించిన రూ.50,000 కోట్లలో విజయవాడ వాటా ఎంతో చెప్పాలి -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెజవాడ నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని, నగర పాలక సంస్థ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని …

Read More »

26న విజయవాడలో సీపీఐ రౌండ్ టేబుల్‌కు ఆహ్వానం

-కరువుపై ఐక్య పోరాటాలు -పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలి -ఖరీఫ్ రైతుల ఆందోళనకరం -55 లక్షల ఎకరాల్లో విత్తనాలే వేయలేని దుస్థితి -కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి -పార్టీలు, రైతు ప్రజా సంఘాలతో సీపీఐ ప్రతినిధి బృందం భేటీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 26న విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించనున్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా హాజరు కావాల్సిందిగా …

Read More »

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను జిల్లా కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు వివిధ విభాగాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు, మౌలిక …

Read More »

మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురానున్న గోవా షిప్‌యార్డ్

-రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ -సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తాం -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 8వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గనులు, భూగర్భ …

Read More »