-రేపు ‘వారణాసి–వాద్నగర్ సేవా యాత్ర’లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ప్రజా జీవితంలో నరేంద్ర మోదీ చేసిన సేవలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాశీ నగరంలో వారణాసి–వాద్నగర్ సేవా యాత్రను చేపట్టారు. ప్రధాని మోదీ ప్రజా జీవితంతో ప్రత్యేక అనుబంధం ఉన్న …
Read More »Daily Archives: September 16, 2026
తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
-భక్తుల భద్రత, సౌకర్యాలు, ఆధ్యాత్మిక అనుభూతికి పెద్దపీట -ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సేవలు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించే లక్ష్యంతో టీటీడీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కార్యక్రమాలు …
Read More »ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా తిరుమల
-భక్తుల అనుభూతిని పెంచేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ -రూ.104 కోట్లతో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ప్రారంభం -భక్తుల సౌకర్యార్ధం 32 ఈవీ బస్సులు అందించిన రిలయన్స్, భారత్ బయోటెక్ -తిరుమల వచ్చే భక్తులకు ఎల్ఐసీ ఆధ్వర్యంలో రూ.2 లక్షల బీమా -రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం: సీఎం చంద్రబాబు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మికతకు ప్రపంచ స్థాయి నమూనాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో భక్తులకు మెరుగైన …
Read More »నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
-వీపీఆర్ ఫౌండేషన్ రూ.8.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేట్ హంగులతో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో శిథిలావస్తలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసి కార్పోరేట్ స్కూళ్లను తలపించేలా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నెల్లూరు నగరంలో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వీఆర్ సీ స్కూల్ ను ఆధునీకరించడం జరిగింది. …
Read More »నెల్లూరులో పునర్ నిర్మించిన డీఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
-రూ.13.41 కోట్ల వ్యయంతో డీఎస్ఆర్ హైస్కూల్ అభివృద్ధి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు మూలాపేటలో ఆధునిక వసతులతో పునర్ నిర్మించిన డీఎస్ఆర్(దేవిరెడ్డి శారద) ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ రూ.13.41 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ డి.సుధాకర్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ …
Read More »ప్రతి అర్హుడికి రుణాలు అందితేనే అంతిమ ఫలితం
-టిడ్కో గృహాలకు రుణాలపై కార్యాచరణ -రుణాల మొత్తం పెరిగినా…లక్ష్యాలకు దూరంలో బ్యాంకులు -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 236వ ఎస్ఎల్‌బీసీ సమావేశం -రుణాల చెల్లింపుల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆదర్శం -వచ్చే ఎస్ఎల్‌బీసీ నుంచి బ్యాంకులు, జిల్లాలు, విభాగాల వారీగా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని, ప్రతి అర్హుడికి బ్యాంకింగ్ సేవలు చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం జరిగిన 236వ ఎస్ఎల్‌బీసీ …
Read More »అల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ రిఫైనరీ
-రామాయపట్నం పోర్టు వద్ద రూ.1.45 కోట్లతో ప్రాజెక్టు -త్వరితగతిన ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్న సీఎం -ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీపీసీఎల్ ఎండీ సంజయ్ ఖన్నా భేటీ -రిఫైనరీ సమీపంలో 1,500 ఎకరాల్లో పెట్రోకెమికల్స్ పార్క్ ఏర్పాటుకు సీఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రిఫైనరీ సమీపంలో పెట్రో కెమికల్ పార్కును కూడా …
Read More »ధరలకు కళ్లెంతోనే ద్రవ్యోల్బణం కట్టడి
-మార్కెట్ ఇంటర్వెన్షన్‌తో ధరల నియంత్రణ -హైరిస్క్ ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు -వ్యవసాయం, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని …
Read More »పరిష్కార నైపుణ్యాలు పెరగాలి…
-పి.బి. సిద్ధార్థలో హాక్ థాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సాంకేతిక యుగంలో విద్యార్థులు పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, పరిష్కార దిశగా యువత ఆలోచనలు సాగాలని అమిగ్డా(బ్రిటన్) సంస్థ ప్రొడక్షన్ విభాగం జనరేటివ్ ఏఐ ఆర్ అండ్ డి డెవలపర్ చక్కా గుణశేఖర వెంకట చెంచయ్య అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఏఐ, డేటా సైన్స్ విభాగాలు స్మార్ట్ ఇండియా పేరుతో నిర్వహించిన హ్యాకథాన్ ను వెబినార్ హాలులో బుధవారం ఆయన ప్రారంభిస్తూ నెట్ వర్క్ …
Read More »HCL-Techలో Associate హోదాలో అవకాశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ 2025-26లో ఉత్తీర్ణులైన 75% మార్కులు వచ్చిన NON-Maths గ్రూప్ విద్యార్థులకు అంతర్జాతీయ కంపెనీ అయిన HCL-Techలో Associate హోదాలో అవకాశం. తిరుపతి జిల్లా ఉన్న జూనియర్ కళాశాలల్లోని CEC, NON Maths గ్రూపుల్లోని CEC, HEC, BiPC మరియు vocational విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 75% ఉత్తీర్ణులైన విద్యార్థులు 19-09-2026 ఉదయం 10 గంటలకు, శ్రీ రామ ఇంజనీరింగ్ కళాశాల కర్కంబడి రోడ్, రామ్ రెడ్డ నగర, మంగళం, తిరుపతి లో HCL-Tech వారు నిర్వహించే …
Read More »
Prajavartha Online Telugu News