తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ 2025-26లో ఉత్తీర్ణులైన 75% మార్కులు వచ్చిన NON-Maths గ్రూప్ విద్యార్థులకు అంతర్జాతీయ కంపెనీ అయిన HCL-Techలో Associate హోదాలో అవకాశం.
తిరుపతి జిల్లా ఉన్న జూనియర్ కళాశాలల్లోని CEC, NON Maths గ్రూపుల్లోని CEC, HEC, BiPC మరియు vocational విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 75% ఉత్తీర్ణులైన విద్యార్థులు 19-09-2026 ఉదయం 10 గంటలకు, శ్రీ రామ ఇంజనీరింగ్ కళాశాల కర్కంబడి రోడ్, రామ్ రెడ్డ నగర, మంగళం, తిరుపతి లో HCL-Tech వారు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఆసక్తి గల విద్యార్థులందరూ https://registrations.hcltechbee.com/ ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఇంటర్మీడియట్ బోర్డు, HCL-Techbee సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావున, ఆసక్తి కలిగిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లోని ప్రిన్సిపాల్ గారి కళాశాలల్లో గల Non maths గ్రూపుల్లో 2025-26లో 75% ఉత్తీర్ణులైన విద్యార్థులు మరియు 80% తో ఉత్తీర్ణులైన MPC, MEC విద్యార్థులందరూ పైన ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు RIEO, గోపాల్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSDO అధికారి లోకనాధం తెలియజేశారు.
ఇతర వివరాలుకు HCL ప్రతినిధి మరియు నిర్వాహకులు కోనేటి రేవంత్ (Ph: 8019913422) వారిని సంప్రదించవలసిందిగా తెలియజేయడమైనది.
Prajavartha Online Telugu News