-తొలి ఏకాదశి సందర్భంగా వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వేద పారాయణం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »Tag Archives: tirupathi
భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం కక్షసాధింపు చర్యే : ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టాన్ని అమలు …
Read More »షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026
-SSC మరియు ఇంటర్మీడియట్ ప్రతిభావంతుల సన్మాన కార్యక్రమం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం 2026 జూలై 20వ తేదీ (సోమవారం) ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా …
Read More »గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
-శాస్త్రోక్తంగా ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు -జూలై 20న వైభవంగా పార్వేట ఉత్సవం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన …
Read More »పాత్రికేయులపై దాడి అత్యంత దుర్మార్గం..
-నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపై టీడీపీ నేతలు గూండాల మాదిరిగా దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై, ఇద్దరు కూటమి ప్రభుత్వ మంత్రుల సమక్షంలోనే దాడి జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి …
Read More »శ్రీకాళహస్తి జనసేన బలోపేతానికి దిశానిర్దేశం
-డా. పసుపులేటి హరిప్రసాద్ కీలక మార్గదర్శకత్వం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక మార్గదర్శకత్వం అందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముచ్చివోలులో దండి నరేంద్ర నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. …
Read More »ఆయుర్వేదం భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వ వైద్య సంపద… : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని రవీంద్ర నగర్, సమవాయి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SKD గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కనకాస్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు …
Read More »వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి.
-గ్రామీణ ఉపాధికి మరింత భరోసా.. 125 రోజుల పని -వీబీ-జీ రామ్ -జీ పై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన -కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ తిరుపతి జిల్లాలో రూ.175 కోట్లతో 4,627 పనులు చేపట్టాం -జూలై 1 నుంచి ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభం -డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సి. మద్దిలేటి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ …
Read More »పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైన సందర్భంగా, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తిరుపతిలోని అలిపిరి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ …
Read More »రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదు… : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టించేందుకు కొందరు రాజకీయ శక్తులు కుట్రలు …
Read More »
Prajavartha Online Telugu News