శ్రీకాళహస్తి జనసేన బలోపేతానికి దిశానిర్దేశం

-డా. పసుపులేటి హరిప్రసాద్ కీలక మార్గదర్శకత్వం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక మార్గదర్శకత్వం అందించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముచ్చివోలులో దండి నరేంద్ర నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, అలాగే ఎన్‌డీఏ కూటమి స్పూర్తిని కాపాడుతూ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని డా. హరిప్రసాద్ వివరించారు.
జనసైనికులతో ఆత్మీయంగా మమేకమైన ఆయన, వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని పార్టీ అభివృద్ధికి అవసరమైన పలు సూచనలు చేశారు. దండి నరేంద్ర నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత చురుకుగా ప్రజల్లో పనిచేసి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేయడానికి సమిష్టిగా కృషి చేయాలని సంకల్పించారు. సమావేశం జనసైనికులు, నాయకుల్లో నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు, పార్టీ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఫలవంతమైన సమావేశంగా నిలిచింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *