-200 మందికి పైగా రోగులకు వైద్య సేవలు
-ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండు నెలలకోసారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం జబ్బులకు ప్రతి రెండు నెలలకు మూడవ ఆదివారం నాడు నిర్వహించబడుతున్న హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు నేడు అనగా సెప్టెంబర్ 20 (ఆదివారం) నాడు పాయకాపురం, లహరి విద్యా మందిర్ లో జయప్రదంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులను ప్రముఖ వైద్యులు డాక్టర్ చావా మురళీకృష్ణ, డాక్టర్ బి . శ్రీహర్ష పరీక్షించి అవసరమైన మందులను రాసి ఇచ్చారు . సరైన ఆహారపు అలవాట్లు మరియు చక్కని జీవనశైలితో పాటు రెగ్యులర్ చెకప్ మరియు వైద్యం తోనే షుగర్ మరియు బీపీ జబ్బు ముప్పులను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని , వైద్యుల సూచనలను పాటించాలని, మందులు వాడాలని సూచించారు. పేద , మధ్యతరగతి ప్రజల కొరకు ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా మెడికల్ క్యాంపును నిర్వహించడం అభినందించదగిన విషయమని అన్నారు.
అనంతరం మెడికల్ క్యాంప్ వాలంటీర్లు రోగులకు అవసరమైన టాబ్లెట్లు మరియు ఇన్సులిన్లను పంపిణీ చేశారు. మందులు ఎలా వాడాలో వివరించారు. ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ జి. విజయ్ ప్రకాష్ రోగుల సమస్యలను తెలుసుకొని, అందుకు అనుగుణంగా వాలంటీర్లకు సూచనలు అందించారు.
క్యాంపులో ప్రజా ఆరోగ్య వేదిక నేతలు డాక్టర్ బి . సంపత్, ఎం సత్యప్రసాద్, మురళి, జి. దుర్గారావు, జి.వి. రంగారెడ్డి, శ్రీధర్ మరియు జే వి వి నేతలు బోయి రవి, ప్రసాద్, మరియు క్యాంపు వాలంటీర్లు, శ్రీరామ్, జోగిరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగిన క్యాంపులో సుమారు 200 మంది రోగులకు సేవలు అందించడం జరిగింది. రెండు నెలలకోసారి మూడవ ఆదివారం నాడు జరిగే ఈ క్యాంపు తిరిగి నవంబర్ 15వ తేదీన నిర్వహించబడుతుందనీ ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా కార్యదర్శి, క్యాంప్ కోఆర్డినేటర్ జి. విజయ్ ప్రకాష్ తెలిపారు.
డాక్టర్ దేవరపల్లి వినోద్ మరియు సుందర్ నేతృత్వంలోని హెచ్. సి. జి క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం పేషెంట్లకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను ఈ క్యాంపులో నిర్వహించారు.
Prajavartha Online Telugu News